సోనియా అనుమతితో 150వ సినిమా: చిరంజీవి
150వ సినిమా ఎప్పుడు చేస్తారు? అని ఎవరి నుంచి ప్రశ్న ఎదురైనా చిరంజీవి చెప్పే సమాధానం ఇదే. తాజాగా శుక్రవారం బెంగుళూరు నగర శివారులోని కేంబ్రిడ్జ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నిర్వహించిన 'చిగురు 2013' సాంస్కృతిక ఉత్సవాలలో ముఖ్య అతిధిగా పాల్గొనేందుకు వచ్చిన చిరంజీవికి మీడియా వారి నుంచి ఇలాంటి ప్రశ్నే ఎదురైంది చిరంజీవికి.
దీనికి ఆయన సమాధానం ఇస్తూ చక్కని సందేశంతో కూడిన సామాజిక విలువలున్న కథ దొరికితే నటించడానికి నేను సిద్దమే అని, సోనియా గాంధీ అనుమతితో 150వ సినిమా చేస్తానని తెలిపారు. మరి చిరంజీవి సినిమా వచ్చే దెప్పుడో..? మనం చూసే దెప్పుడో..?
చిరంజీవి సినిమా చేయాలంటే ఇలా జరగాల్సిందేనా?
ప్రస్తుతం చిరంజీవి కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ ఎన్నికల వరకు ఆయన ఫుల్ బిజీ. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి చిరంజీవి మళ్లీ కేంద్ర మంత్రి అయితే మాత్రం అభిమానులు మరో ఐదేళ్ల వరకు చిరంజీవి 150వ సినిమాపై ఆశలు వదులు కోవాల్సిందే. ఎందుకంటే కేంద్రమంత్రిగా దేశంలో తన శాఖ వ్యవహారాలను చక్క దిద్దేందుకే ఆయనకు సమయం చాలదు. అలాంటి పరిస్థితుల్లో సినిమాలు చేసే వీలు ఆయనకు దొరకడం అసంభవం. ఒక వేళ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడి, చిరంజీవిని రాజకీయ నిరుద్యోగం చుట్టుముడితే తప్ప ఆయనకు సినిమాలు చేసేంత ఖాళీ సమయం దొరికే పరిస్థితి కనిపించడం లేదు.


Click it and Unblock the Notifications












