ఖంగుతిన్న కొరటాల టీమ్.. కండీషన్స్ అప్లై!
ఈ మధ్యకాలంలో ప్రతీ సినిమాను లీకుల బాధలు వెంటాడుతూనే ఉన్నాయి. షూటింగ్ పిక్స్, సినిమా అప్‌డేట్స్ ఎంత గోప్యంగా ఉంచాలని ప్రయత్నించినా ఫలితం ఉండటం లేదు. ముఖ్యంగా పెద్ద సినిమాలకు ఇదో కష్టంగా మారింది. దీంతో తమ సినిమా పిక్స్, వీడియోస్ లీకుల బారిన పడకుండా పలు జాగ్రత్తలు తీసుకోక తప్పడం లేదు. ఈ మేరకు సెట్స్‌పై స్ట్రిక్ట్ అప్లై చేయాల్సిన పరిస్థితి వస్తోంది.
గతంలో RRR షూటింగ్‌కి సంబంధించిన కొన్ని పిక్స్ బయటకు రావడంతో ఆ సినిమా దర్శకుడు రాజమౌళి చిత్రయూనిట్ అందరికీ ఒకే కండీషన్ పెట్టారు. ఎవ్వరు కూడా సెట్స్ మీదకు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, సెల్ ఫోన్స్ తీసుకురాకూడదని ఆర్డర్ చేశారు. తాజాగా కొరటాల శివ కూడా తన సినిమా చిరు 152కి అదే రూల్ పాస్ చేశారని తెలుస్తోంది.

కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా భారీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా గోప్యంగా ఉంచారు కానీ, ఇటీవలే చిరంజీవి లుక్ ఒకటి లీక్ అయి చిత్రయూనిట్‌కి షాకిచ్చింది. ఈ పరిణామంతో ఖంగుతిన్న కొరటాల.. ఇక లాభంలేదని భావించి ఇకపై సెట్లో మొబైల్స్, ల్యాప్ టాప్స్ లాంటి గ్యాడ్జెట్స్ తీసుకురాకూడదని కండీషన్స్ అప్లై చేశారట. చూడాలి మరి ఈ కండీషన్స్ లీకులను ఏ మేర అదుపు చేస్తాయో!.


Click it and Unblock the Notifications











