పాటతో మొదలెట్టిన చిరంజీవి.. ఇక ఆగేదే లేదన్నట్లుగా జోష్

మెగాస్టార్ అభిమానుల ఎదురు చూపులకు ఫుల్‌స్టాప్ పెట్టేస్తూ తన 152వ సినిమా సెట్స్ పైకి వచ్చేశారు మెగాస్టార్ చిరంజీవి. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా గురువారం రోజు (జనవరి 2) రెగ్యులర్ షూట్ మొదలుపెట్టుకుంది. కాగా ఈ సినిమా తొలి షాట్ పాటతో మొదలు పెట్టడం విశేషం.

సామాజిక అంశాలను ఎలివేట్ చేస్తూ సినిమాలు రూపొందించడంలో దిట్ట అయిన కొరటాల శివ.. చిరంజీవి 152 కోసం కూడా బలమైన కథ ఎంచుకున్నారు. దేవాలయాల్లో జరుగుతున్న అక్రమాల నేపథ్యంలో ఈ సినిమా స్క్రిప్ట్ రెడీ చేశారట కొరటాల. నేటి సమాజంలో దేవాలయాల ప్రాముఖ్యత తెలియజేస్తూ, ఆ దేవాలయాల్లో జరిగే అక్రమాలపై స్పెషల్ ఫోకస్ పెడుతూ కథను నడిపించనున్నారట.

 Chiranjeevi 152: Shooting Starts With Song

చిత్రంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉద్యోగిగా చిరంజీవి సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. అలాగే చిరంజీవి సరసన సీనియర్ హీరోయిన్ త్రిష ఫిమేల్ లీడ్ పోషించనుంది. తొలి షెడ్యూల్ హైదరాబాద్ నగరంలోని కోకాపేట‌లో వేసిన భారీ సెట్‌లో మొదలు పెట్టుకున్న ఈ సినిమా అతిత్వరలో ఫారం లొకేషన్స్‌కి వెళ్లనుందని తెలుస్తోంది.

కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా తెరకెక్కించనున్న ఈ చిత్రానికి 'గోవిందా హరి గోవిందా' అనే టైటిల్ పరిశీలనలో ఉంచారు. ఇక ఆగేదే లేదన్నట్లుగా షూటింగ్ జోష్ చూపిస్తూ ఆగ‌స్ట్ 14న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుంచేలా టార్గెట్ పెట్టుకున్నారు కొరటాల శివ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X