మెగా 152 అప్‌డేట్.. ఇన్‌డైరెక్ట్‌గా హీరోయిన్ హింట్..!

ఇటీవలే సైరా నరసింహా రెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. తన 152వ సినిమాకు సిద్ధమవుతున్నారు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో అనౌన్స్ చేయబడినప్పటికీ 'సైరా' షూటింగ్ కారణంగా ఆలస్యమవుతూ వచ్చింది. చివరకు ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకొని అఫీషియల్‌గా సెట్స్ పైకి వచ్చింది.

కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. చిత్రంలో చిరంజీవి విభిన్నమైన లుక్‌లో మరింత గ్లామర్ గా కనిపించనున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఏహీరోయిన్‌గా త్రిష, నయనతార, అనుష్క పేర్లు వినిపిస్తున్నప్పటీకీ ఎవ్వరూ ఫైనల్ కాలేదు.

Chiranjeevi 152 Update.. Eesha Rebba Is Part Of The Movie!

ఇదిలా ఉండగానే తాజాగా మరో హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. పైగా ఆమె ఓ తెలుగు హీరోయిన్. ఆమెనే అందాల ఈషా రెబ్బా. మెగాస్టార్ 152 సినిమాలో ఈషా రెబ్బా కీలక పాత్ర పోషిస్తోందని ఆమె అభిమాని ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టగా దానిపై ఈషా లైక్ కొట్టేసింది. ఇంకేముంది.. మెగాస్టార్ 152 సినిమాలో ఈషా రెబ్బా కన్ఫర్మ్. ఇలా లైక్ కొట్టేసి ఆమెనే ఇన్‌డైరెక్ట్‌గా హింట్ ఇచ్చేసిందనే టాక్ మొదలైంది.

ఇటీవ‌ల ఎన్టీఆర్ హీరోగా వచ్చిన 'అర‌విందస‌మేత‌' సినిమాలో ఈషారెబ్బా కీల‌క పాత్ర‌ పోషించిన సంగతి తెలిసిందే. కాకపోతే అనుకున్న స్థాయిలో ఆమెకు పేరు రాలేదు. మరి ఈ సారైనా మెగాస్టార్ చిత్రంలో నటించి మంచి మార్కులు పట్టేస్తుందో చూడాలి మరి. ఇక మెగా 152 కోసం కొరటాల స్ట్రాంగ్ స్క్రిప్ట్ రెడీ చేశారని తెలుస్తోంది. ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే ది బెస్ట్ అయ్యేలా రూపొందించాలని కొరటాల ప్లాన్ చేస్తున్నారట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X