»   » చిరంజీవి బర్త్ డే సెలబ్రేషన్స్: ఫ్యాన్స్ మధ్య కేక్ కటింగ్..(ఫోటోస్)

చిరంజీవి బర్త్ డే సెలబ్రేషన్స్: ఫ్యాన్స్ మధ్య కేక్ కటింగ్..(ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి 60వ పుట్టినరోజు వేడుకలు శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఘనంగా జరిగాయి. శుక్రవారం సాయంత్రం 4 గంటల నుండే వేడుకలు ప్రారంభం అయ్యాయి. చిరంజీవి కేక్ కటింగుతో వేడుకలు ముగిసాయి. ఈ సందర్భంగా పలు సినీ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకున్న అభిమానులను మెమొంటోలతో సత్కరించారు. ఈ వేడుకల్లో అభిమానులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ వేడుకల్లో పవన్ కళ్యాణ్ మినహా.... మిగిలిన మెగా ఫ్యామిలీ హీరోలంతా పాల్గొన్నారు. స్లైడ్ షోలో చిరంజీవి కేక్ కట్ చేస్తున్న ఫోటోస్...

చిరంజీవి
  

చిరంజీవి

తన 60వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా శిల్పకళా వేదికలో అభిమానుల మధ్య జరిగిన కార్యక్రమంలో చిరంజీవి కేక్ కటింగ్.

రామ్ చరణ్
  

రామ్ చరణ్

చిరంజీవి పుట్టినరోజు వేడుకలను ఇంత భారీగా సెలబ్రేట్ చేయడానికి రామ్ చరణ్ ముందస్తుగా ప్లాన్ చేసారు.

గ్రాండ్ గా...
  

గ్రాండ్ గా...

తెలుగు రాష్ట్రాల నుండి ఈ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు భారీగా అభిమానులు తరలి వచ్చారు.

మెగా ఫ్యామిలీ
  

మెగా ఫ్యామిలీ


మెగా ఫ్యామిలీ హీరోలంతా ఒకే వేదికపై రావడంతో అభిమానులు మరింత ఉత్సాహంగా కనిపించారు.

అభిమానులకు థాంక్స్
  

అభిమానులకు థాంక్స్

అభిమానుల వల్లే తాను తామంతా ఈ స్థాయికి చేరుకున్నామని చెప్పిన చిరంజీవి.... వారి రుణం తీర్చుకోలేనిది అన్నారు.

Please Wait while comments are loading...