twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆనందంలో అసలు విషయం బయటకు.. ఆచార్య సెట్ గుట్టు విప్పిన చిరంజీవి

    |

    మెగాస్టార్ చిరంజీవికి ఆనందం ఎక్కువైతే చంటిపిల్లాడిలా మారిపోతాడు. అలా పట్టరాని సంతోషంలో రహస్యంగా దాచి ఉంచాల్సిన వాటిని కూడా అందరి ముందు పెట్టేస్తాడు. అలా చిరంజీవి సినిమాలకు సంబంధించిన ఎన్నో ట్విస్ట్‌లను కూడా బయట పెట్టేశాడు. ఏకంగా తన సినిమా టైటిల్‌ను కూడా అనౌన్స్ చేసేశాడు. అలా చిరు ఆనందానికి అవధుల్లేకుండాపోతుంటాయి. తాజాగా చిరంజీవి మరోసారి ఆనందంపట్టలేకపోయాడు.

    Recommended Video

    Kajal Aggarwal, Gautam Takes Blessing From Chiranjeevi In Acharya Set
    భారీ సెట్ నిర్మాణం..

    భారీ సెట్ నిర్మాణం..

    ఆచార్య కోసం భారీ సెట్ నిర్మాణం జరుగుతోందని, భారత దేశంలోనే అతి పెద్ద సెట్ అంటూ 20 ఎకరాల్లో నిర్మిస్తోన్నారంటూ 20 కోట్లు ఖర్చుపెడుతున్నారంటూ రకరకాలుగా వార్తలు వచ్చాయి. వాటిని చదువుతూంటేనే అందరికీ రోమాలు నిక్కబొడుచుకువచ్చాయి. ఇక విజువల్స్ ఓ రేంజ్‌లో ఉంటాయని అందరూ ఆశించారు.

    చిరు ఉత్సాహం..

    చిరు ఉత్సాహం..

    అందరూ కూడా ఆచార్య సెట్‌పై చర్చలు పెడుతున్న ఈ తరుణంలో చిరంజీవి అందరికీ షాక్ ఇచ్చాడు. ఆ సెట్‌ను చూసి ముగ్దుడైన చిరంజీవి అసలు గుట్టంతా విప్పేశాడు. ఆచార్య కోసం వేసిన భారీ ఆలయ నిర్మాణం గురించి పూసగుచ్చినట్టు వివరించాడు. ఈ మేరకు ఓ వీడియోను షేర్ చేశాడు.

    మీతో పంచుకోవాలని..

    మీతో పంచుకోవాలని..

    ఆచార్య సినిమా కోసం ఇండియాలోనే అతిపెద్ద టెంపుల్ టౌన్‌ సెట్‌ను నిర్మించారు.. దాదాపు 20 ఎకరాల్లో అద్భుతమైన సెట్ నిర్మించారు. అందులో భాగంగా గాలి గోపురం. ఆశ్చర్యం గొలిపేలా ప్రతీ చిన్న విషయాన్ని డీటెయిల్‌గా మలిచారు.. ఇది కళా ప్రతిభకే మచ్చుతునక.. నాకెంతో ముచ్చట అనిపించి నా కెమెరాలో బంధించాను. మీతో పంచుకోవాలని అనుకున్నాను అని చిరంజీవి చెప్పుకొచ్చాడు.

     అందరికీ ఆల్ ది బెస్ట్..

    అందరికీ ఆల్ ది బెస్ట్..

    నిజంగానే ఓ టెంపుల్ టౌన్‌లో ఉన్నామా? అనేంతగా ఈ సెట్‌ను రూపొందించిన కళా దర్శకులు సురేష్‌ని, ఈ టెంపుల్ టౌన్‌ను విజువలైజ్ చేసిన దర్శకుడు కొరటాల శివకు దీన్ని ఇంత అపూర్వంగా నిర్మించేందుకు కావాల్సిన వనరులను సమకూర్చిన నిర్మాత నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్‌లను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.. ప్రేక్షకులకు కూడా ఈ సెట్ ఆనందానుభూతులను కలిగిస్తుందనడం ఎలాంటి సందేహం లేదు. ఆచార్య టీంకు ఆల్ ది బెస్ట్ అంటూ చిరు చెప్పుకొచ్చాడు.

    English summary
    Chiranjeevi About acharya Temple Town set In 20 Acres
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X