మెగా-అల్లు ఫ్యామిలీలపై రూమర్స్.. ఎందుకు ఇలా చేస్తున్నారో అంటూ స్పందించిన మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్ మధ్య ఎంతటి సాన్నిహిత్యం, సంబంధాలున్నాయో అందరికీ తెలిసిందే. చిరంజీవి తాను తీసుకునే ప్రతీ నిర్ణయంలో అల్లు అరవింద్ సలహాలు, సూచనలుంటాయని ఎన్నో మార్లు బహిరంగంగానే చెప్పిన సందర్భాలున్నాయి. అయితే వారి మధ్య రిలేషన్ ఎలా ఉన్నా.. బయటకు మాత్రం వేరేలా ప్రొజెక్ట్ అవుతుంది. ఈ రెండు ఫ్యామిలీస్ మద్య గొడవలు జరుగుతున్నాయని, విభేదాలున్నాయని వార్తలు వస్తూనే ఉంటాయి. దీనికి చాలా కారణాలున్నాయి.. అయితే తాజాగా ఈ విబేధాలపై చిరు స్పందించాడు. చిరు ఏమన్నాడో ఓ సారి చూద్దాం.

అల్లు అర్జున్ ఓ కారణం..
మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య విబేధాలున్నాయని వార్తలు రావడానికి అల్లు అర్జున్ ఓ ముఖ్య కారణం అవుతుంటాడు. బన్నీ మాటలు, చేసే చేష్టలు అనుమానాలకు తావిచ్చేలా ఉంటాయి. ఒక్కోసారి మెగా ఫ్యామిలీతో సంబంధాలు లేనట్టు మాట్లాడుతుంటాడు. కేవలం అల్లు బ్రాండ్, అల్లు ఫ్యామిలీ గురించే చెప్పడంతో రెండు కుటుంబాల్లో విభేదాలు ఏర్పడ్డాయనే వార్తలు వస్తుంటాయి.

వేదికలపైనా అల్లు బ్రాండ్..
అల్లు అర్జున్ అల వైకుంఠపురములో చిత్రానికి సంబంధించిన ఈవెంట్‌లో బన్నీ మాట్లాడిన మాటలు, అల్లు ఫ్యామిలీ గురించి చెప్పిన మాటలు వింటుంటే.. వేరే కుంపటి పెట్టాడేమోనన్న టాక్ నడుస్తోంది. కేవలం అల్లు అరవింద్, అల్లు రామలింగయ్య పేర్లను జపించాడు. ఇండస్ట్రీ హిట్ కొట్టిన బన్నీ.. తన సొంత బ్రాండ్‌పైనే నిలబడాలని అనుకుంటున్నాడేమోనన్న కామెంట్స్ వినిపించాయి.

పవన్‌తో దూరం..
మెగా అల్లు ఫ్యామిలీలో కోల్డ్ వార్ నడుస్తుందనే వార్తలు రావడానికి మరో కారణం కూడా ఉంది. పవన్ కళ్యాణ్‌తో విబేధాలు, ఆయన ఫ్యాన్స్‌తో బన్నీకి గొడవలు జరగడం, మధ్యలో కొంతకాలం దూరంగా ఉండటం లాంటివన్నీ ఇలాంటి వార్తలకు ఆజ్యం పోశాయి. అయితే తాజాగా వీటిపై చిరు స్పందించాడు.

అంతా కలిసే..
అల్లు అరవింద్ తమ కుటుంబ సభ్యుడని, ఇద్దరం కూడా ఒకరి సలహాలు ఒకరం తీసుకుంటూ ఉంటామని చిరంజీవి తెలిపాడు. ముఖ్యమైన విషయాలను కలిసి చర్చించుకుంటూ ఉంటామని మెగాస్గార్ అన్నాడు. ప్రతీ పండుగకు అంతా కలుసుకుంటామని, దీపావళి, సంక్రాంతి ఘనంగా జరుపుకున్నామని చిరు గుర్తు చేశాడు.
Recommended Video

ఇలా ఎవరు చేస్తారో..
మా మధ్య విభేదాలు ఉన్నాయనడంలో ఎంతమాత్రం నిజం లేదని, గతంలో తన తమ్ముడు పవన్ కల్యాణ్ తోను విభేదాలు వున్నట్టుగా ప్రచారం చేశారని చిరంజీవి అన్నాడు. ఇలాంటి ఆరోపణలు ఎవరు చేస్తున్నారో .. ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని చిరు చెప్పుకొచ్చాడు. నిజం చెప్పాలంటే ఇలాంటి పుకార్లను తాను పెద్దగా పట్టించుకోను కూడా అంటూ రూమర్స్‌ను మెగాస్టార్ కొట్టిపారేశాడు.


Click it and Unblock the Notifications











