Just In
- 1 hr ago
నా గర్ల్‌ఫ్రెండ్ ఈమెనే... సమంతకు పరిచయం చేసిన అల్లు అర్జున్.. బన్నీ తొలి ప్రియురాలు ఎవరంటే!
- 2 hrs ago
రాయలసీమ వ్యక్తిగా పవన్ కల్యాణ్: ఆ సినిమా కోసం సరికొత్త ప్రయోగం చేస్తున్నాడు
- 2 hrs ago
Vakeel Saab Day 6 collections..నైజాం, ఏపీలో రికార్డుల మోత.. బాక్సాఫీస్ వద్ద పవన్ కల్యాణ్ మూవీ హల్చల్
- 3 hrs ago
‘ఆచార్య’లో హైలైట్ ఫైట్ ఇదే: ప్రభాస్ సినిమాను తలపించేలా ప్లాన్ చేసిన కొరటాల
Don't Miss!
- News
అంబేద్కర్‌పై సీజేఐ అనూహ్య క్లెయిమ్ -సంస్కృతం అధికార భాషగా ప్రతిపాదన చేశారన్న జస్టిస్ బోబ్డే
- Sports
డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీ.. ఆర్సీబీపై కొనసాగుతున్న ఆధిపత్యం!
- Finance
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గొచ్చు: ఎక్సైజ్ సుంకం తగ్గించే యోచన
- Lifestyle
రొమ్ముల కింద దద్దుర్లు వస్తున్నాయా? రాషెస్ తగ్గించుకోవడానికి ఇలా చేయండి..
- Automobiles
మరో ఏడాది కాలం పొడగించిన ఫేమ్ II సర్టిఫికెట్స్ వ్యాలిడిటీ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పుష్పరాజ్‌గా అల్లుఅర్జున్ తగ్గేదేలే.. బన్నీకి చిరు బర్త్ డే విషెస్
టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఇక ఐకాన్ స్టార్‌గా మారిపోయిన సంగతి తెలిసిందే. నిన్న జరిగిన ఈవెంట్‌లోనే ఈ ఐకాన్ స్టార్ గురించి బన్నీ చెప్పుకొచ్చాడు. ఇకపై తన జర్నీలో ఐకాన్ స్టార్‌గా ఉంటానని, స్టైల్‌గా ఉంది కదా? నాక్కూడా నచ్చింది అంటూ తన శైలిలో డైలాగ్‌లు కొట్టేశాడు. అయితే దీనిపై ఓ వైపు ట్రోలింగ్ జరుగుతూనే వస్తోంది. అయితే తాజాగా చిరు వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
|
పుష్ప టీజర్..
పుష్ప టీజర్ ఏ రేంజ్‌లో దూసుకుపోతోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బన్నీ స్టైల్, ఆ యాక్షన్, రస్టిక్ లుక్ అన్నీ కూడా అదిరిపోయాయి. అన్నింటికంటే ముఖ్యంగా దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓ రేంజ్‌లో ఆకట్టుకుంది. తాజాగా చిరంజీవి బన్నీకి బర్త్ డే విషెస్ చెబుతూ పుష్ప గురించి మాట్లాడాడు.

బన్నీ బర్త్ డే..
బన్నీ బర్త్ డే (ఏప్రిల్ 8) సందర్బంగా విడుదల చేసిన పుష్ప టీజర్ క్లిక్ అవ్వడంతో మేకర్స్ హ్యాపీగా ఉన్నారు. అలా మొత్తానికి బన్నీ బర్త్ డేకు ఫ్యాన్స్ కోసం రెడీ చేసిన గిఫ్ట్ అందరినీ ఆకట్టుకుంది. ఇక సెలెబ్రిటీలు సైతం పుష్ప రాజ్‌గా బన్నీ చించేశాడని అంటున్నారు.
|
చిరు అలా..
చిరంజీవి తాజాగా బన్నీకి బర్త్ డే విషెస్ చెప్పాడు. అయితే ఊరికే పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పకుండా పుష్ప టీజర్‌పై రివ్యూ కూడా ఇచ్చాడు. పుష్ప టీజర్ చూశాను. పుష్ప రాజ్‌గా అల్లు అర్జున్ తగ్గేదేలే అంటూ అదిరిపోయేలా ప్రశంసలు కురిపించాడు.

ఫ్యాన్స్ ఫైర్..
చిరంజీవి ఇలా బన్నీ గురించి ట్వీట్ వేయడం మాత్రం ఫ్యాన్స్‌కు నచ్చడం లేదు. నిన్నటి ఈవెంట్‌లో బన్నీ మెగా ఫ్యామిలీ మాట కూడా ఎత్తలేదు.. కనీసం చిరంజీవి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు.. పైగా ఆర్ఆర్ఆర్ సినిమాను మరిచిపోయాడని ఫ్యాన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. అలాంటి బన్నీకి విషెస్ ఎందుకు చెబుతున్నారు అంటూ ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు.

మరో వైపు అలా..
అయితే బన్నీ బర్త్ డే సందర్బంగా ఆయన పేరు ట్విట్టర్‌లో మోత మోగాలి. కానీ ట్విట్టర్ అకీరా నందన్ బర్త్ డే ట్రెండ్ అవుతోంది. జూనియర్ పవర్ స్టార్ అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు సందడి చేస్తున్నారు. అకీరా నందన్ ఇమేజ్ ఎలా ఉందో దీన్ని బట్టే తెలుస్తోంది.