»   » ‘బాహుబలి’ గురించి మెగాస్టార్ చిరంజీవి ఇలా...

‘బాహుబలి’ గురించి మెగాస్టార్ చిరంజీవి ఇలా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమ గర్వించే స్థాయిలో హాలీవుడ్ రేంజి సినిమా తీసిన దర్శకుడు రాజమౌళికి అన్ని వైపుల నుండి ప్రశంసలు అందుతున్నాయి. రాజమౌళి అండ్ టీం తమ సినిమా సాధిస్తున్న ఫలితాలు, ప్రేక్షకులు, సినీ ప్రముఖులు నుండి అందుతున్న ప్రశంసలతో దాదాపు మూడేళ్లుగా పడ్డ కష్టాన్ని మరిచిపోతున్నారు.

తాజాగా ఈ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. రామ్ చరణ్ భాగస్వామిగా ఉన్న టర్భో మెగా సంస్థకు చెందిన ట్రూజెట్‌ విమానం ప్రారంభోత్సవానికి శనివారం రేణుగుంట వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ బాహుబలి సినిమా చాలా బాగుందని, బాగా ఆడాలని ఆకాంక్షించారు.

Chiranjeevi about Baahubali movie

చిరంజీవి 150వ సినిమా...
శుక్రవారం తను భాగస్వామిగా ఉన్న ట్రజెట్ విమానయాన సంస్థ లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ విషయమై రామ్ చరణ్ చిరంజీవి 150వ సినిమాపై స్పందించారు. నాన్న 150వ సినిమా నుండి పూరి జగన్నాధ్ ఇంకా తప్పుకోలేదు. సెకండాఫ్ కథ, స్క్రిప్టు వర్క్ ఇంకా పూర్తి కానందునే జాప్యం జరుగుతుందని రామ్ చరణ్ స్పష్టం చేసారు.

నాన్నకు సెకండాప్ నచ్చితే నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఒక వేళ పూరి దర్శకత్వమే ఫైనల్ అయితే ఆ చిత్రానికి ఆటోజానీ టైటిల్ పెడతామన్నారు. వివి వినాయక్ కూడా చిరంజీవి 150వ సినిమాపై ఆసక్తి చూపుతున్న రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. రామ్ చరణ్ మాటలు బట్టి చిరంజీవి 150వ సినిమాకు డైరెక్టర్ ఖరారు కాలేదన్నమాట. రామ్ చరణ్ ఇచ్చిన ట్విస్టుతో అభిమానులు అయోమయంలో పడ్డారు.

English summary
Tollywood actor Chiranjeevi about Baahubali movie.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu