»   »  చిరంజీవి స్పందన.... బాలయ్య గురించి హ్యాపీగా, పవన్ గురించి చిరాగ్గా!

చిరంజీవి స్పందన.... బాలయ్య గురించి హ్యాపీగా, పవన్ గురించి చిరాగ్గా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చిరంజీవి హోస్ట్ గా 'మీలో ఎవరు కోటీశ్వరుడు' 4వ సీజన్ ఫిబ్రవరి 13 నుండి ప్రారంభం కాబోతోంది. ఈ మేరకు ఆదివారం పార్క్ హయత్ హోటల్ లో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' 4వ సీజన్ లాంచ్ చిరంజీవి చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా మాటీవీ కొత్త లోగోను కూడా చిరంజీవి లాంచ్ చేసారు.

ఈ సందర్భంగా ఓ విలేకరి.... మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో బాలకృష్ణ కూడా పాల్గొనే అవకాశం ఉందా? అని ప్రశ్నించారు. దీనికి చిరంజీవి సమాధానం ఇచ్చారు. బాలయ్య గురించి హ్యాపీగా సమాధానం ఇచ్చిన మెగాస్టార్, తర్వాత తన తమ్ముడ పవన్ కల్యాన్ గురించి ఓ విలేకరి ప్రశ్నించగా అసహనానికి గురయ్యారు.

 బాలకృష్ణ, సల్మాన్ కలిసి డాన్స్ చేసాం

బాలకృష్ణ, సల్మాన్ కలిసి డాన్స్ చేసాం

ఇదే చోట ఇదే పార్క్ హయత్ లో ఇదే ప్లేసులో నా బర్త్ డే జరిగినపుడు బాలకృష్ణ, సల్మాన్ ఖాన్, నేను కలిసి సరదాగా చాలా చక్కగా డాన్స్ చేసాం. నా డాన్స్ నెంబర్స్ కు బాలకృష్ణ గారు చాలా ఎగ్జైట్ అవుతూ... ఆయనా సరదాగా డాన్స్ చేస్తూ మమల్ని అందరినీ ఆనందింప జేసారు. అలాంటి స్నేహితుడు మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో పాల్గొంటే నాకు ఆనందమే అన్నారు.

 బాలయ్యను కూడా అడగమని చెబుతాను

బాలయ్యను కూడా అడగమని చెబుతాను

నాగార్జున వస్తున్నారు, వెంకటేష్ వస్తున్నారు. వాళ్లిద్దరూ ఈ పాటికే అంగీకారం తెలిపారు. వుమన్స్ డే సందర్భంగా జరిగే ఎపిసోడ్లో రాధిక, సుహాసిని ఈ షోలో పాల్గొంటున్నారు. ఇలా నా యాంకరింగులో, హోస్టింగులో చాలా మంది సెలబ్రిటీలు రావడానికి ఉత్సాహం చూపిస్తుంటే నాకు ఎనలేని ప్రోత్సాహం అనినపిస్తోంది. అలాగే మీరు కోరినట్లుగా మిత్రుడు బాలకృష్ణను కూడా అడగమని చెబుతాను. ఆయన చాలా హ్యాపీగా వస్తారని నేను భావిస్తున్నాను అని చిరంజీవి తెలిపారు.

 అసహనానికి గురైన చిరంజీవి

అసహనానికి గురైన చిరంజీవి

ఓ విలేకరి ప్రశ్నించడానికే అంటూ జనసేన పార్టీ పెట్టి ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్ ను మీరు ఈ షోలో ప్రశ్నించే దృశ్యం కనిపిస్తుందా? అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కాస్త అసహనానికి గురైనట్లు కనిపించారు చిరంజీవి.

 అప్రస్తుతం అంటూ పవన్ గురించి

అప్రస్తుతం అంటూ పవన్ గురించి

పవన్ గరించి....ఇపుడు అప్రస్తుతం అండీ. అందరూ. మీలో ఎవరు కోటీశ్వరుడు, స్టార్ మా గురంచి అడిగారు. అంత వరకు ఈ కార్యక్రమంలో అడగటం అడగటం సబబు అనుకుంటున్నాను. మరో సందర్భంలో మీరుఅ డిగిన ప్రశ్నకు సమాధానం చెబుతాను. హి ఈజ్ మై బ్రదర్. నా బ్లడ్ బ్రదర్... అంటూ చిరంజీవి సమాధానం ఇచ్చారు.

English summary
Chiranjeevi talking about Balakrishna and Pawan Kalyan' s participation in MEK4. Chiranjeevi will be making his small-screen debut with 'Meelo Evaru Koteeswarudu'. The first episode of 'Meelo Evaru Koteeswarudu' 4th Edition will be aired at 9.30 PM on February 13th, 2017.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu