twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సీసీసీ నుంచి మూడో విడత సాయం.. చిరు సందేశం వైరల్

    |

    కరోనా కష్టకాలంలో సినీ కార్మికులను, ఉపాధి కోల్పోయిన సినీ శ్రామికులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ)ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోస సీసీసీ ద్వారా సినీ కార్మికుల పొట్ట నింపుతున్నారు. ఇప్పటికే రెండు విడుతలు వారికి కావాల్సిన వంట సామాన్లను అందించారు. నిత్యావసర సరుకులకు ఏ లోటు రాకుండా చూసేందుకు సీసీసీ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దీనిలో భాగంగా మూడో విడతను కూడా ప్రారంభించినట్టు తాజాగా చిరు తెలిపారు.

    ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగ్లకు అనుమతి ఇచ్చినా కూడా సెట్‌పైకి వెళ్లే పరిస్థితులు కనిపించడం లేదు. గడప దాటకుండా ఇంట్లో ఉంటేనే కరోనా వదలడం లేదు. ఇక షూటింగ్ సెట్‌లోకి వెళ్తే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేం కూడా. అందుకే పెద్ద హీరోలెవ్వరూ కూడా గడపదాటడం లేదు. అందుకే షూటింగ్ల సందడి కూడా కనిపించడం లేదు. దీంతో ఉపాధి లేక ఎంతో మంది సినీ కార్మికులు ఖాళీగానే ఉంటున్నారు. అందుకే మూడో విడత కూడా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు చిరు తెలిపారు.

    Chiranjeevi About CCC Third Phase Of Distributing Groceries

    కరోనా క్రైసిస్ ఛారిటీ నుంచి మూడో విడత కూడా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నాం.సినిమా షూటింగ్స్ ఎప్పుడు మొదలవుతాయో తెలియదు. ఇప్పుడున్న పరిస్థితి శాశ్వతం కాదు. తాత్కాలిక కష్టమే. అందరూ ఐక్యంగా పనిచేసుకుని సంతోషంగా గడిపే రోజు దగ్గర్లోనే ఉంది. అంత వరకు ధైర్యంగా నిలబడదాం. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఈ వినాయక చవితి పండుగ సంతోషంగా జరుపుకోవాలని చిరంజీవి విజ్ఞప్తి చేశారు. ఈ వైరస్ తమకేమీ సోకదనే నిర్లక్ష్య ధోరణి అసలు పనికి రాదని.. అందరూ తమను తాము రక్షించుకుంటూ, వారి కుటుంబానికి కూడా రక్షణగా ఉండాలని కోరారు. ప్రస్తుతం ఈ విడతలో రెండు రాష్ట్రాల్లోని దాదాపు పదివేల మంది కార్మికులను అందజేస్తున్నట్టు పేర్కొన్నారు.

    English summary
    Chiranjeevi About CCC Third Phase Of Distributing Groceries. Corona crisis Charity Is To Help Cine Workers Who Lost Their Livelihood.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X