twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మళ్లీ జన్మంటూ ఉంటే అలాగే పుట్టాలి.. చిరంజీవి కామెంట్స్ వైరల్

    |

    మెగాస్టార్ చిరంజీవి సమంతతో పెట్టిన ముచ్చట్లు ఆహా యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. అందులో చిరంజీవి ఎన్నో విషయాలపై సరదాగా స్పందించాడు. రాజకీయ సినీ జీవితం గురించే కాకుండా వ్యక్తిగత జీవితంలోని ఎన్నో విషయాలను బయట పెట్టాడు. అయితే ఇందులో సినీ, రాజకీయ జీవితాలపై కామెంట్ చేస్తూ చిరంజీవి చెప్పిన మాటలు మాత్రం వైరల్ అవుతున్నాయి. వాటిని బట్టి రాజకీయాలపై ఎంత విరక్తి చెంది ఉన్నాడో తెలిసిపోతోంది. ఇంతకీ చిరంజీవి ఏమన్నారో చూద్దాం.

    అభిమానులే బలం..

    అభిమానులే బలం..

    అభిమానుల మనకున్న అతి పెద్ద బలం.. వారికి మనం సరైన మార్గాన్ని చూపిస్తే.. వారిని సరైన దారిలో నడిపించగలిగితే ఎన్నో అద్భుతాలు చేయొచ్చు. అలా ఆలోచించే రక్తదానం ప్రారంభించాను. ఈ కరోనా సమయంలో ప్లాస్మా దానం చేయాలని కోరాను.. స్వయంగా నేను వచ్చి రక్తాన్ని దానం చేశాను. దాంతో చాలా మంది ముందుకు వచ్చి రక్తం, ప్లాస్మాలను దానం చేశారని చిరంజీవి చెప్పుకొచ్చాడు.

     పదేళ్ల గ్యాప్..

    పదేళ్ల గ్యాప్..

    పదేళ్ల గ్యాప్ తరువాత మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ఖైదీ నెంబర్ 150తో దుమ్ములేపాడు. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ అందరూ గోల గోల చేశారు. ఇదే విషయాన్ని సమంత తన షోలో మళ్లీ చిరంజీవిని అడిగింది. తనకు యాక్షన్ లైట్ కెమెరా అంటే చాలు తెలియని ఉత్సాహం వస్తుందని చిరంజీవి చెప్పుకొచ్చాడు. ఆ ఈలలు గోలలు వింటూ ఉంటే ఏదో అనిపిస్తుందని చిరు పేర్కొన్నాడు.

    రెండూ చూశాను..

    రెండూ చూశాను..

    తాను సినిమా జీవితాన్ని చూశాను.. దాదాపు పదేళ్లు రాజకీయ జీవితాన్ని కూడా చూశాను అంటూ చెప్పుకొచ్చాడు. అలా రెండింటిలో అనుభవాలున్నాయి. కానీ తనకు సినిమా లైఫ్ నచ్చిందని.. మళ్లీ జన్మంటూ ఉంటే స్టార్‌గానే పుడతాను అంటూ చిరంజీవి తన మనసులోని కోరికను బయటపెట్టాడు. మళ్లీ అయితే రాజకీయాల్లోకి వెళ్లాలని కోరుకోనని చెప్పుకొచ్చాడు.

    హనుమాన్..

    హనుమాన్..

    ఏ మ్యాన్ అంటే ఇష్టమని సమంత అడుగుతూ.. సూపర్ మ్యాన్, హీ మ్యాన్ అని ఆప్షన్స్ చెబితే.. హనుమాన్ అని చెప్పాడు. తనకు ఆరాధ్య దైవం హనుమాన్ అని చెబుతూ...ఏదైనా ప్రాబ్లమ్ అని నిద్రపోయే ముందు హనుమాన్‌కు విన్నవిస్తే ఉదయం కల్లా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చిరంజీవి అన్నాడు.

    English summary
    Chiranjeevi About Cinema and Political Career In Sam Jam Show,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X