విజేతపై చిరంజీవి రివ్యూ: కంటతడితో బయటకు వచ్చా.. గుండెను పిండేశాడు!

By Rajababu

Recommended Video

Mega Star Chiranjeevi Press Meet On Vijetha Movie

విజేత సినిమా పేరు గుర్తుకు రాగానే మెగాస్టార్ చిరంజీవిని నటుడిగా ఆకాశానికి ఎత్తిన చిత్రం గుర్తుకు వస్తుంది. అలాంటి ప్రజాదరణ పొందిన టైటిల్‌తో సినిమా వస్తుందంటే ప్రత్యేకమైన అటెన్షన్ తప్పక ఉంటుంది. అదికాకుండా మెగా ఫ్యామిలీ నుంచి అలాంటి టైటిల్‌తో వస్తున్నారంటే ఇంకా స్పెషల్ ఎట్రాక్షన్ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ విజేత టైటిల్‌తో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యాడు. కుటుంబ విలువల నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తున్నది. ఈ నేపథ్యంలో విజేత చిత్ర యూనిట్‌ను చిరంజీవి తన నివాసంలో అభినందించారు. ఈ సందర్భంగా చిరంజీవి చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

విజేత ఇంప్రెసివ్‌గా ఉంది

విజేత ఇంప్రెసివ్‌గా ఉంది

విజేత నేను నటించిన చిత్రం. ఆ సినిమా పేరుతో మరో చిత్రం వస్తుందంటే ఆసక్తి పెరిగింది. అంతేకాకుండా కల్యాణ్ నటిస్తుండటంతో మరింత ఉత్సాహం, క్యూరియాసిటీ నెలకొంది. గురువారం ఈ సినిమాను చూశాను. చాలా ఇంప్రెసివ్‌గా ఉంది. సినిమా చూస్తున్న సేపు నన్ను నేను మరిచిపోయాను.

విజేత ఫ్యామిలీ ఎంటర్‌టైనర్

విజేత ఫ్యామిలీ ఎంటర్‌టైనర్

గతంలో వచ్చిన విజేత సినిమా నన్ను ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరగా చేసిన సినిమా. ఈ చిత్రం కూడా కుటుంబ కథా చిత్రంగా రూపొందడటం సంతోషంగా ఉంది. విజేత చిత్రంలో కుటంబంలో సభ్యులందరూ ఎలా ఉండాలి. వారి బాధ్యతలు ఎలా ఉండాలని చక్కగా విడమర్చి చెప్పిన చిత్రం.

 ఫ్యామిలీకి ఎడ్యుకేషన్ మూవీ

ఫ్యామిలీకి ఎడ్యుకేషన్ మూవీ

విజేత సినిమా ఓ ఎడ్యుకేటివ్ సినిమా. ఎడ్యుకేటివ్ అని ఎందుకు అంటున్నానంటే? ఏవో ఆకర్షణలకు లొంగిపోయి తల్లిదండ్రుల పట్ల బాధ్యతగా వ్యవహరించకపోవడం, నిర్లక్ష్యంగా ఉండే ప్రతీ ఒక్కరికి ఈ చిత్రం కనువిప్పు. అలాంటి వారందరూ తప్పుకుండా చూడాల్సిన చిత్రం.

దర్శకుడు రాకేష్ శశి అద్భుతంగా

దర్శకుడు రాకేష్ శశి అద్భుతంగా

దర్శకుడు రాకేష్ శశి తన కథ, మాటలు, స్క్రీన్ ప్లేతో ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా, అద్యంతం నిలబెట్టాడు. అతని టాలెంట్‌ను మీడియా సమక్షంలో అభినందిస్తున్నాను. సినిమాలోని కథ కొంత నెమ్మదిగా ప్రారంభమైనప్పటికీ క్లైమాక్స్‌లో పీక్స్‌కు వెళ్తుంది. ఈ చిత్రంలో ప్రతినాయక పాత్ర లేదు. కానీ ప్రతికూల పరిస్థితులే ప్రతినాయకుడి పాత్రను పోషించాయి. తనకు ఎదురైన సమస్యలను ఓ యువకుడు చక్కగా ఎదుర్కొని విజేతగా నిలిచాడనే విషయాన్ని రాకేష్ అద్బుతంగా తెరకెక్కించాడు.

 తండ్రి అంటే ఆయనే అనేలా

తండ్రి అంటే ఆయనే అనేలా

విజేత చిత్రంలో నటీనటుల గురించి ముందు చెప్పుకోవాల్సి వస్తే మురళీ శర్మ గురించి చెప్పుకోవాలి. మధ్య తరగతి కుటుంబంలో పెద్దగా, ఫ్యామిలిని విపరీతంగా ప్రేమించే తండ్రిగా సునిశితమైన హావభావాలతో ఆయన నటన ఫెంటాస్టిక్. కుటుంబ కోసం తన కెరీర్‌ను, లక్ష్యాలను త్యాగాలు చేసే తండ్రిగా మురళీ శర్మ అద్భుతంగా నటించాడు. క్లైమాక్స్‌లో ఆయన నటన, ఎక్స్‌ప్రెషన్స్ బ్రహ్మండంగా ఉన్నాయి. తోటి నటుడిగా మురళీ శర్మ నటనను చూసి ఆయనను అభినందించకుండా ఉండలేకపోతున్నాను.

మురళీ శర్మ అవార్డు విన్నింగ్ ఫెర్ఫార్మెన్స్

మురళీ శర్మ అవార్డు విన్నింగ్ ఫెర్ఫార్మెన్స్

నటుడిగా న్యాయం చేయాలనుకొంటే విజేత చిత్రంలోని నటనకు మురళీ శర్మకు ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టు అవార్డు రావాలి. వస్తుందని ఆశిస్తున్నాను. ఇవ్వాలని కోరుకొంటున్నాను. తప్పకుండా వస్తుందని ఆశిస్తున్నాను.

కల్యాణ్ దేవ్ కొత్త అనిపించలేదు

కల్యాణ్ దేవ్ కొత్త అనిపించలేదు

విజేత చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కల్యాణ్ దేవ్ ఎక్కడా కొత్త నటుడు అనే ఫీలింగ్ కలుగులేదు. డ్యాన్సులు బాగా చేశాడు. తనదైన శైలిలో ఎవరినీ ఇమిటేట్ చేయకుండా ఫ్రెష్‌గా కనపడటం ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. భావోద్వేగ సన్నివేశాలలో కల్యాణ్ నటుడిగా ఆకట్టుకొన్నాడు. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తనకు మంచి భవిష్యత్ ఉందని నిరూపించుకొన్నాడు.

సెంథిల్ కుమార్ కెమెరా పనితనం

సెంథిల్ కుమార్ కెమెరా పనితనం

బాహుబలి సినిమాకు సినిమాటోగ్రఫిని అందించిన సెంథిల్ కుమార్ ఈ సినిమాకు పనిచేయడం ఓ ఎసెట్. మా చిత్రానికి పనిచేసే అవకాశం ఇస్తారో లేదో అనేంతగా బిజీగా ఉన్నారు. సెంథిల్ చిన్న సినిమాకు ఎలా ఒప్పుకొన్నారనే విషయం ఆసక్తిని కలిగింది. ప్రతీ ఫ్రేమును అద్బుతంగా తెరకెక్కించారు. లైటింగ్, మూడ్‌ను క్రియేష్ చేసే అంశాలను చక్కగా చూపించారు.

సాయి కొర్రపాటి నిర్మాణ విలువలు

సాయి కొర్రపాటి నిర్మాణ విలువలు

కథ విన్నప్పటి నుంచి సినిమాను ఓ ప్రొడ్యూసర్‌గా పూర్తి స్థాయి బాధ్యతను చేపట్టాడు. ది బెస్ట్ అనిపించేలా రూపొందించేందుకు ఆయన పడిన తపన అద్భుతం. కథ విన్నప్పుడు కొన్ని సన్నివేశాలను ఎలా తెరకెక్కిస్తారో అనే విషయంపై సందేహాలు ఉండేవి. చిత్రాన్ని చూసిన తర్వాత శభాష్ అనిపించే రితీలో మంచి నిర్మాణ విలువతలో సినిమాను రూపొందించాడు.

కంటతడితో బయటకు వచ్చాను

కంటతడితో బయటకు వచ్చాను

నిన్న విజేత సినిమా చూసిన తర్వాత థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పడు కంటితడి, హృదయంలో ఆర్ధ్రతతో చలించిపోయాను. సినిమాలో క్లైమాక్స్ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. దర్శకుడు విశ్వనాథ్ తీసే క్లైమాక్స్ గుర్తొచ్చింది. విశ్వనాథ్ తరహాలో విజేత క్లైమాక్స్‌ను చూపించాడు అని చిరంజీవి అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X