పవన్ కోరితే లూసిఫర్ ఇచ్చేస్తా.. రాజమౌళి ఓకే అంటేనే.. మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఆస్వాధిస్తున్నాడు. ప్రకృతిని ప్రేమిస్తూ.. ప్రశాంతంగా ఉన్న నగరాన్ని చూసి మురిసిపోతోన్నాడు. జనాలంతా ఇంటికే పరమితం కావడంతో.. అంతా నిర్మానుష్యంగా మారింది. రోజురోజుకూ చేజారి పోతోన్న పరిస్థితి, కరోనాపై అవగాహన కలిగిచేందుకు నిత్యం ఏదో ఓక సందేశాన్ని ఇస్తూనే ఉన్నాడు. ఇటీవలె ప్రధాని ఇచ్చిన పిలుపును సమర్థిస్తూ.. ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు దీపాలను వెలిగించండని సూచించాడు. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా ముచ్చట్లు చెప్పుకొచ్చాడు. అవేంటో ఓ సారి చూద్దాం.

ఆచార్యలో నక్సలైట్..?

ఆచార్యలో నక్సలైట్..?

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయితే ఆ మధ్య లీకైన ఫోటోతో చిరు నక్సలైట్‌గా నటిస్తున్నాడని అంతా ఫిక్స్ అయ్యారు. తాజాగా దానిపై క్లారిటీ ఇస్తూ.. కొరటాలకు వామపక్ష భావాలున్నాయి, ఆయన స్వభావం, ఆయన వ్యక్తిత్వం ఆ పాత్రలోనూ ప్రతిబింభిస్తుంటుందని, ఇంతవరకు తాను చెప్పగలనని పేర్కొన్నాడు.

ఆచార్యలో మహేష్ బాబు..?

ఆచార్యలో మహేష్ బాబు..?

ఆచార్య సినిమాలో ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందని, ఆ పాత్రకు ముందుగా రామ్ చరణ్‌ను అనుకున్నారని, ఆపై మళ్లీ మహేష్ బాబు వైపు చూశారని ఇలా ఏవేవో రూమర్స్ వచ్చాయి. అయితే వీటిపై స్పందించిన చిరు.. అసలు మహేష్ పేరు ఎందుకు వచ్చిందో తనకు తెలీదని, మహేష్‌ కూడా తన బిడ్డలాంటి వాడేనని, అతనితో కలిసి నటిస్తే బాగుంటుందని చెప్పుకొచ్చాడు.

రాజమౌళి ఓకే అంటేనే...

రాజమౌళి ఓకే అంటేనే...

ఆచార్య సినిమాలో ఓ క్యారెక్టర్ కోసం మొదటి నుంచి రామ్ చరణ్‌ను తీసుకోవాలని కోరటాల భావించాడని చెప్పుకొచ్చాడు. అయితే రాజమౌళి ఆర్ఆర్ఆర్‌తో బిజీగా ఉండటం మూలానా ఇంకా ఏదీ నిశ్చయించుకోలేదని తెలిపాడు. రాజమౌళి-కొరటాల మాట్లాడుకుని ఓ నిర్ణయానికి వస్తే రామ్ చరణ్ ఆచార్యలో ఉంటాడు. అయినా తామిద్దరం కలిసి నటించాలన్నది సురేఖ కోరిక.. తల్లి కోరిక నేరువేరుతుందో లేదో చూడాలి అని తెలిపాడు.

పవన్ కోరితే ఇచ్చేస్తా..

పవన్ కోరితే ఇచ్చేస్తా..

తదుపరి ప్రాజెక్ట్‌ల గురించి మాట్లాడుతూ.. లూసిఫర్ రీమేక్‌కు ఇంకా దర్శకుడిని ఫిక్స్ చేయలేదని పేర్కొన్నాడు. లూసిఫర్ రీమేక్‌ను పవన్ కళ్యాణ్ చేయాలనుకుంటున్నాడనే రూమార్స్‌పై మాట్లాడుతూ.. ఆ విషయం తన వరకు రాలేదని, ఒకవేళ పవన్ కళ్యాణ్ కోరితే ఇచ్చేస్తానని తమ్ముడిపై ప్రేమను మరోసారి ప్రదర్శించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X