twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అసలు మహేష్‌బాబును లెక్కలోకి తీసుకోలేదు.. రూమర్లపై చిరంజీవి క్లారిటీ

    |

    గత కొద్దికాలంగా ఆచార్య సినిమా గురించి పలు విషయాలు టాలీవుడ్ మీడియాలో హాట్‌హాట్‌గా మారాయి. త్రిష తప్పుకోవడం, మహేష్ బాబు స్పెషల్ అప్పీయరెన్స్ గురించి వార్తలు వైరల్‌గా మారాయి. త్రిష వ్యవహారమైతే జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. కాగా, ఆచార్యలో మహేష్ బాబు పాత్రపై మెగాస్టార్ చిరంజీవి స్వయంగా స్పందించారు. తాజాగా ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్, రాంచరణ్ విషయాల గురించి చిరంజీవి మాట్లాడూ..

     ఆచార్యలో మహేష్ బాబు

    ఆచార్యలో మహేష్ బాబు

    ఆచార్య సినిమా పోస్టు ప్రొడక్షన్ ఉన్న సమయంలోనే అందులో స్టూడెంట్ లీడర్ పాత్రలో మహేష్ బాబు నటిస్తున్నారనే వార్త వైరల్ అయింది. అయితే కొరటాలతో మహేష్‌కు ఉన్న అనుబంధం కారణంగా పాసిబుల్ అయితే కావొచ్చేమో అనే ఓ ఫీలింగ్ కలిగింది. అయితే అటూ మహేష్ గానీ, ఇటు ఆచార్య టీమ్ కానీ ఆ వార్తను ధృవీకరించలేదు. కానీ మీడియాలో మాత్ర ఇప్పటికీ మహేష్ గురించి ప్రస్తావన వస్తూనే ఉంది. దానిపై చిరంజీవి ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

     మహేష్ గురించి రూమర్ నా వరకు..

    మహేష్ గురించి రూమర్ నా వరకు..

    ఆచార్య సినిమాలో అతిథి పాత్రలో మహేష్ బాబు నటిస్తున్నారనే రూమర్లు నా వద్దకు కూడా వచ్చాయి. అలాంటి రూమర్లు ఎవరు క్రియేట్ చేశారో తెలియదు. కానీ వాటిలో వాస్తవం లేదు. ఆచార్య విషయానికి వస్తే తాము ఆ పాత్రకు మహేష్ బాబును ఎన్నడూ పరిగణనలోకి తీసుకోలేదు. ఇలాంటి వార్తలు మీడియాలో ఎలా పుట్టాయో.. ఎందుకు పుడుతాయో కూడా అర్ధం కాదు. కానీ మహేష్ బాబు అనే విషయం చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అంటూ చిరంజీవి తన మనసులోని భావాలను పంచుకొన్నారు.

     మహేష్ నా కొడుకు లాంటి వాడు

    మహేష్ నా కొడుకు లాంటి వాడు

    ఆచార్యలోని స్టూడెంట్ లీడర్ పాత్రకు మహేష్ బాబుకు ఎలా లింకు పెట్టారో అర్ధం కాదు. నేనంటే మహేష్‌కు చాలా రెస్పెక్ట్. నాకు కూడా చాలా ఇష్టం. నాకు కొడుకు లాంటి వాడు. కాన మేము ఆ పాత్ర కోసం ఎన్నడూ సంప్రదించలేదు. మేమిద్దరి కలిసి నటించే అవకాశం వస్తే మాత్రం చాలా గ్రేట్‌గా ఉంటుంది. ఆ విషయం మనసుకు తడితేనే గొప్పగా ఫీలింగ్ కలుగుతుంది అని చిరంజీవి అభిప్రాయపడ్డారు.

    మొదటి నుంచి చెర్రీ కోసమే

    మొదటి నుంచి చెర్రీ కోసమే

    ఆచార్య కథ చెప్పినప్పటి నుంచి స్టూడెంట్ లీడర్ పాత్రలో రాంచరణ్ నటిస్తే బాగుంటుందని దర్శకుడు కొరటాల శివ పట్టుబడుతున్నారు. కానీ రాంచరణ్ ప్రస్తుతం RRR సినిమాలో నటిస్తున్నాడు. చెర్రీ డేట్స్ అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. కొరటాల శివ, రాజమౌళి మధ్య అవగాహనపైనే ఆ విషయం ఆధారపడి ఉంటుంది. అయితే ఆ పాత్ర అతిథి పాత్ర కాదు. ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ అని చిరంజీవి క్లారిటీ ఇచ్చారు.

    Recommended Video

    PM Modi Telugu Tweet To Appreciate Chiranjeevi & Nagarjuna And Tollywood
    చిరు సరసన కాజల్

    చిరు సరసన కాజల్

    ప్రస్తుతం కరోనావైరస్ కారణంగా పలు సినిమాలతోపాటు ఆచార్య చిత్ర షూటింగ్ కూడా నిలిచిపోయింది. లాక్‌డౌన్ తర్వాత చిత్ర షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. కాగా, త్రిష తప్పుకోవడంతో హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ ఆ పాత్రలోకి వచ్చింది. త్వరలోనే ఆమె ఆచార్య చిత్రంలో భాగం కానున్నారు. రాంచరణ్ స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాంచరణ్ కూడా కీలక పాత్రను పోషించే అవకాశం ఉంది.

    English summary
    Megastar Chiranjeevi cleared about Mahesh babu role in Acharya. He said, I don know how this rumour was created in the industry. Koratala Siva thinking about Ram charan for this role.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X