»   » మెగా ఫ్యాన్స్ చీలిక: పోవచ్చంటూ చిరు వ్యాఖ్య!

మెగా ఫ్యాన్స్ చీలిక: పోవచ్చంటూ చిరు వ్యాఖ్య!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Chiranjeevi
హైదరాబాద్: ఓ వైపు అన్నయ్య చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఆ పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో.....తమ్మడు పవన్ కళ్యాణ్ కొత్తగా 'జనసేన' పేరుతో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడం, కాంగ్రెస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా మోడీ, చంద్రబాబులతో చేతులు కలపడం లాంటి పరిణామాలతో రాష్ట్ర రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి.

చిరంజీవి-పవన్ కళ్యాణ్ వ్యవహారంతో....మెగా అభిమానులు కూడా రెండుగా చీలారనే ప్రచారం గత కొంతకాలంగా సాగుతోంది. కొందరు చిరంజీవి వైపే ఉండగా, చాలా మంది పవన్ కళ్యాణ్‌కు మద్దతు ఇస్తున్నరనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై చిరంజీవి స్పందించారు.

'నాకు కొడుకైనా, తమ్ముడైనా, అభిమానులైనా....అందరూ నాకు ఒక్కటే. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారికి ఉంటాయి. ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయి. వారు ఎవరికి మద్దతు ఇచ్చినా నాకు అభ్యంతరం లేదు. ఎవరు ఎటువైపైనా వెళ్లొచ్చు. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే హక్కు అందరికీ ఉంది' అనే తరహాలో చిరంజీవి స్పందిసున్నారు.

సినిమాల పరంగా అభిమానులు విడిపోతారని నేను అనుకోను. రాజకీయాల పరంగా అభిమానుల అభిప్రాయాలు వేర్వేరుగా ఉండొచ్చు అని చిరంజీవి వ్యాఖ్యానించారు. చిరంజీవి వ్యాఖ్యలు చూస్తుంటే అభిమానుల విషయంలో ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నారని స్పష్టమవుతోంది.

English summary
'Whether it is my son, brother or fans, all are equal and they can all make their individual choices as they have their own thoughts and ideologies', says Chiru, hinting that fans have a choice to support any of the mega hero they like. Also he expressed strong feeling that fans are not divided via movies, but just for the case of politics they are taking these stands.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu