»   »  మోహన్‌బాబు రాక్షసుడు, చంపేస్తాడనే వచ్చా ...చిరంజీవి కామెంట్

మోహన్‌బాబు రాక్షసుడు, చంపేస్తాడనే వచ్చా ...చిరంజీవి కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

వైజాగ్ : పొరబాటున సినిమా షూటింగ్ పెట్టాను. కాకపోతే చివరి నిమిషంలో తెలుసుకుని ఈ రాక్షసుడు ఇక్కడకు రాకపోతే చంపేస్తాడు అనుకుని షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని వచ్చాను అని చిరంజీవి...మోహన్ బాబు ని ఉద్దేశించి అన్నారు.

శనివారం రాత్రి విశాఖపట్నంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నటుడు మోహన్‌బాబు 40 వసంతాల సినీ ప్రస్థానాన్ని పురస్కరించుకుని టి.సుబ్బరామిరెడ్డి లలిత కళపరిషత్‌ ఆధ్వర్యంలో ఘన సన్మానం జరిగింది. మోహన్‌బాబుకు టి.ఎస్‌.ఆర్‌. లలిత కళా పరిషత్‌ తరపున టి.సుబ్బరామిరెడ్డి 'నవరస నట తిలకం' బిరుదును ప్రదానం చేశారు.

వైజాగ్‌లో జరుగుతున్న సుబ్బరామిరెడ్డి పుట్టినరోజు వేడుకల సందర్భంగా నవరస నటుడు మోహన్‌బాబుకు 40 సంవత్సరాల సినీ ప్రస్థాన సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబుతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. మోహన్‌బాబు తనకు ఫోన్ చేసి హాజరు కావాల్సిందిగా కోరినప్పుడు తాను వెంటనే ఓకే చెప్పానని తెలిపారు.

Chiranjeevi about Mohan Babu at MB40 event


చిరంజీవి మాట్లాడుతూ ''నా ఆప్తుడు మోహన్‌బాబు. ఇక్కడ సన్మానం జరుగుతున్నది మోహన్‌బాబుకి కాదు. క్రమశిక్షణకి, కష్టానికీ, పట్టుదలకీ జరుగుతున్న సన్మానిది. మనసులో గట్టిగా అనుకొంటే సాధించలేనిది ఏదీ లేదని మోహన్‌బాబు నిరూపించారు. నాదీ, ఆయనదీ సమాంతరంగా వస్తున్న సుదీర్ఘ ప్రయాణం. సినీ ప్రవేశం పూల పూన్పు కాదు, ముళ్లబాట. భవిష్యత్తు ఏమవుతుందనే అయోమయం ఉంటుంది.

కష్టం అనే ఆయుధాన్ని చేత్తో పట్టుకొని దూసుకెళ్లాడు మోహన్‌బాబు. మోహన్‌బాబు నిజంగా ఒక పర్వతం. ఆయన పలికిన డైలాగుల్ని పుస్తకంగా వేశారు. ఆ పుస్తకాన్ని లండన్‌ పార్లమెంట్‌లో ఆవిష్కరించారు. అదొక గొప్ప గౌరవం. తన చిత్ర ప్రయాణానికి సంబంధించిన పుస్తకానికి నన్ను ముందు మాట రాయమన్నారు. అది మోహన్‌బాబు నాకు ఇచ్చిన ఓ గౌరవంగా భావిస్తా. మా ఇద్దరి మధ్య పొరపచ్ఛాలు ఉన్నట్టుగా, మేమేదో టామ్‌ అండ్‌ జెర్రీ అన్నట్లుగా ప్రచారం జరుగుతుంటుంది. మా మనసుల్లో అలాంటిదేమీ ఉండద''అన్నారు.


మోహన్‌బాబుకు చిరంజీవి స్వర్ణ కంకణాన్ని బహుకరించారు. మోహన్‌బాబు ఫొటో పుస్తకాన్ని శ్రీదేవి ఆవిష్కరించారు. పెదరాయుడు చిత్ర ఫొటోల పుస్తకాన్ని సినీనటుడు వెంకటేశ్‌, రాఘవేంద్రరావు తదితరులు ఆవిష్కరించారు.

English summary
During his speech at MB40 celebrations in Vizag last night, Chiranjeevi said he never had major differences with Mohan Babu over these years and that even the small issue during the TFI Vajrotsavalu was given an ugly colour by the media and detractors on social media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu