చిరంజీవి ఏం చెప్పారు? ఊపందుకున్న వార్తలు!
హైదరాబాద్: చిరంజీవి 150వ సినిమా గురించి గత కొంత కాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇటీవల 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షో చిత్రీకరణలో పాల్గొన్న చిరంజీవిని నాగార్జున మల్టీస్టారర్ సినిమా గురించి అడగ్గా....చిరంజీవి సముఖంగా బదులిచ్చినట్లు తెలుస్తోంది. 'మీలో ఎవరు కోటీశ్వరుడు' ప్రోమోలో ఈ విషయం స్పష్టంగా ఉంది. రేపు(ఆగస్టు 7)న ప్రసారం అయ్యే షో చూస్తే పూర్తి విషయాలు వెల్లడికానున్నాయి.
మీలో ఎవరు కటీశ్వరుడు ప్రోమో కారణంగా చిరంజీవి 150వ సినిమాపై కొత్త వార్తలు మొదలయ్యాయి. ఆయన 150వ సినిమా మల్టీస్టారర్ సినిమా అయి ఉంటుందా? అనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ మధ్య రామ్ చరణ్ కూడా తాను నాన్నగారి 150వ సినిమాలో నటిస్తానని స్పష్టం చేసారు. ప్రస్తుతం మల్టీస్టారర్ చిత్రాల ట్రెండ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ విషయం హాట్ టాపిక్ అయింది.

దర్శకుడు ఎవరు?
చిరంజీవి సినిమా అంటే ఆశామాషీ విషయం కాదు. సత్తా ఉన్న దర్శకుడు కావాలి. అందుకే దర్శకుల విషయంలోనూ మల్లగుల్లాలు పడ్డారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి 150వ సినిమాకు దర్శకుడిగా వివి వినాయక్ లేదా బోయపాటి శ్రీనుల్లో ఎవరో ఒకరిని పైనల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయమై అఫీషియల్ సమాచారం వెలువడే అవకాశం ఉంది.

చిరంజీవి ప్రతిష్టాత్మక సినిమా
చిరంజీవి కెరీర్లో అంత్యంత ముఖ్యమైన ప్రాజెక్టు కావడతో ఈచిత్రం నిర్మాణ బాధ్యతలను రామ్ చరణ్ దగ్గరుండి చూసుకోబోతున్నారు. చిరంజీవి భార్య సురేఖ నిర్మాతగా వ్యవహరించనున్నారు.

అన్ని అంశాలతో 150వ సినిమా
చిరంజీవి 150వ సినిమాలో అన్ని అంశాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సినిమా మంచి కథాంశం, సందేశం, కమర్షియల్ ఎలిమెంట్స్ ఇలా అన్ని విషయాలు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

పుట్టిన రోజు కానుకా?
ఈ సారి మెగా అభిమానులకు చిరంజీవి బర్త్ డే ఆగస్టు 22న 150 సినిమా గురించి అఫీషియల్ ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.
మరో వైపు చిరంజీవి 150వ సినిమాలో నటించే హీరోయిన్ ఎవరు? ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ సరసన చేసిన హీరోయిన్లతో చిరంజీవి రొమాన్స్ చేసారా? లేక కొత్త భామను ఎంపిక చేసారా? అనేది చర్చనీయాంశం అయింది.
చిరంజీవి 150వ సినిమాకు దర్శకుడు ఎవరనే చర్చ గత కొంతకాలంగా జోరుగా సాగుతున్నసంగతి తెలిసిందే. 150వ సినిమా కావడం, రాజకీయాల తర్వాత చిరంజీవి నటిస్తున్న సినిమా కావడంతో ఈచిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గత కొంతకాలంగా కథ గురించి చాలా అన్వేషణ జరిగింది. బెస్ట్ స్టోరీ కోసం చాలా కథలు పరిశీలించారు.


Click it and Unblock the Notifications











