»   » నాగబాబు తిట్ల దండకం, పవన్ ఇష్యూ, చెర్రీ-మహేష్ స్నేహంపై.... చిరంజీవి స్పందన!

నాగబాబు తిట్ల దండకం, పవన్ ఇష్యూ, చెర్రీ-మహేష్ స్నేహంపై.... చిరంజీవి స్పందన!

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: ఇటీవల హాయ్ లాండ్‌లో జరిగిన 'ఖైదీ నెం 150' ఆడియో వేడుకలో మెగా బ్రదర్ నాగ బాబు చేసిన కామెంట్స్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు యండమూరిని ఉద్దేశించి... వారి పేర్లను ఎత్తకుండానే నాగ బాబు ఫైర్ అయ్యారు. వారిపై కుసంస్కారి, అక్కుపక్కి అంటూ తిట్లదండకంతో విరుచుకుపడ్డారు.

  ఇక ఖైదీ నెం 150 ఆడియో వేడుక ముందు పవన్ కళ్యాణ్ రాక గురించి చాలా చర్చ జరిగింది. ప్రతి సారి పవన్ కళ్యాణ్ మెగా ఫంక్షన్స్ అన్నింటికీ డుమ్మా కొడుతుండటంతో.... ఈ సారి అలా జరుగకుండా పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించేందుకు చిరంజీవి భార్య సురేఖ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లారనే ప్రచారం కూడా జరిగింది.

  ఈ నెల 11న'ఖైదీ నెం 150' సినిమా విడుదల ఉండటంతో.... సినిమా ప్రమోషన్లో భాగంగా మెగాస్టార్ మీడియా సంస్థలతో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలో నాగబాబు కామెంట్స్, పవన్ కళ్యాణ్ అంశంపై ఎదురైన ప్రశ్నలకు చిరంజీవి స్పందించక తప్పలేదు.

  సురేఖ పవన్ ఇంటికి వెళ్లలేదు, మేం బాగానే ఉన్నా

  సురేఖ పవన్ ఇంటికి వెళ్లలేదు, మేం బాగానే ఉన్నా

  ఖైదీ ప్రీరిలీజ్ ఫంక్షన్‌కు హీరో పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించేందుకు తన భార్య సురేఖ అతని ఇంటికెళ్లినట్టు ప్రచారం జరిగింది, అసలు పవన్ ఇంటికి తన భార్య సురేఖ ఎందుకు వెళుతుందని, ఇలాంటి ఆలోచనలు తమలో లేవని, మీకెందుకు వస్తాయని చిరంజీవి ప్రశ్నించారు. తామంతా బాగానే ఉన్నామని చిరంజీవి స్పష్టం చేసారు.

  హర్టయ్యారు.

  హర్టయ్యారు.

  గతంలో తమ గురించి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు తనతో పాటు.. తన కుటుంబ సభ్యులు, ఫ్యాన్స్ అంతా హర్ట్ అయ్యామని చెప్పారు. కానీ, దీనిపై తాను ఎలాంటి భావన వ్యక్తం చేయలేదన్నారు. తనది చాలా సున్నిత మనస్తత్వమన్నారు చిరంజీవి.

  నాగబాబు కామెంట్స్ మీద

  నాగబాబు కామెంట్స్ మీద

  అందరికీ నాలాగే సున్నిత మనస్తత్వం ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన మనస్తత్వం ఉంటుంది, నాగబాబు నాలాగా సాఫ్ట్ కాదు.... అలా మాట్లాడటంలో తప్పులేదనేది నా భావన అని చిరంజీవి తెలిపారు. ఈ గొడవ ఎందుకు మొదలైంది, దానికి కారణం ఏమిటనే దానిపై స్పందించడానికి చిరంజీవి నిరాకరించారు చిరంజీవి.

  బాలయ్యతో క్లాష్ పై

  బాలయ్యతో క్లాష్ పై

  ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉంది. ఖైదీ నంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాలు ఒకేసారి విడుదల కావడంలో ఎలాంటి నష్టం లేద, అయినా ఇది కావాలని ఏర్పడ్డ పోటీ కాదు, యాదృచ్ఛికంగా ఒకేసారి విడుదలకు సిద్ధమయ్యాయని చిరంజీవి తెలిపారు.

  మా ఫ్యామిలీ హీరోల మధ్య కూడా పోటీ ఉంది

  మా ఫ్యామిలీ హీరోల మధ్య కూడా పోటీ ఉంది

  ప్రతి రంగంలో పోటీ ఉంటుంది, సినిమా రంగంలోనూ అది ఉంటుంది. మా ఫ్యామిలీ హీరోల మధ్య కూడా పోటీ ఉంది. కానీ అది హెల్తీ కాంపిటీషన్. ఇతర హీరోలతోనూ తమకు హెల్తీ కాంపిటీషనే ఉందని చిరంజీవి తెలిపారు.

  చెర్రీ-మహేష్ ఫ్రెండ్షిప్

  చెర్రీ-మహేష్ ఫ్రెండ్షిప్

  నేటితరం యువ హీరోల మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. రామ్ చరణ్, మహేష్ బాబుల మధ్య ఫ్రెండ్‌షిప్ మధ్య మంచి స్నేహం ఉంది. ఇటీవలి వారిద్దరు విదేశాల్లో హాలిడే ట్రిప్‌ సందర్భంగా కలుసుకున్న విషయాన్ని చిరంజీవి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

  అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నా

  అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నా

  సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో సినిమా వారిపై, సినిమాలపై కొందరు దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఇలాంటివి చాలా గొడవల వరకువ వెలుతున్నాయి. దీనిపై చిరంజీవి స్పందిస్తూ... సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ ఇతరులను హర్ట్ చేసే విధంగా ఉంటున్నాయి, నిజానిజాలు తెలుసుకోకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటివి మంచిదా, కాదా అనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు.

  English summary
  Chiranjeevi about Nagababu comments. Megastar supports Nagababu. Check out details. Nagag made controversial statements at various functions that put him in spot. recently he used the platform of "Khaidi No 150" event to attack on Ram Gopal Varma who has been tweeting against Chiranjeevi and the family members of megastar.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more