twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తలసాని సేవా ట్రస్ట్ కార్యక్రమానికి చిరంజీవి గైర్హాజరు.. కారణాన్ని వివరించిన మెగాస్టార్

    |

    కరోనా దెబ్బకు తెలుగు సినీ పరిశ్రమ ఎంతగా కుదేలైందో అందరికీ తెలిసిందే. గత రెండు నెలలుగా షూటింగ్స్ జరగక, థియేట్స్ మూతపడటం వంటి వాటితో ఎంతో మంది ఉపాధిని కోల్పోయార. దాదాపు 14 వేల మంది ఉపాధి లేక బిక్కుబిక్కుమంటున్నారు. వారి వేదనను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు సినీ పెద్దలు. చిరంజీవి నేతృత్వంలో సినీ పెద్దలందరూ కలిసి.. సినిమాటోగ్రఫర్ మంత్రి తలసాని, సీఎం కేసీఆర్‌లతో భేటీ అయ్యారు.

    సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం..

    సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం..

    టాలీవుడ్ పెద్దలందరూ విన్నవించిన సమస్యలను విన్న ప్రభుత్వం వారి పట్ల సానుకూలంగా స్పందించింది. ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, ఇన్ డోర్ షూటింగ్స్ చేసుకోవడానికి అనుమతినిచ్చింది. ఈ మేరకు కోవిడ్ నిబంధనలను పాటించాలని పేర్కొంది.

    కార్మికుల సాయం కోసం..

    కార్మికుల సాయం కోసం..

    సినీ కార్మికులకు అండగా సినిమాటోగ్రఫర్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిలిచారు. ఇబ్బందుల్లో ఉన్న‌ దాదాపు 14 వేల మంది సినీకార్మికుల‌ కుటుంబాలకు త‌ల‌సాని ట్రస్ట్ ద్వారా నిత్యావ‌స‌రాల సాయం అందించారు. ఈ మేరకు నేటి ఉదయం నిత్యావసర సరకులను అందించారు.

    సెలెబ్రిటీల చేతుల మీదుగా..

    సెలెబ్రిటీల చేతుల మీదుగా..

    అయితే ఈ సరుకులను సెలెబ్రిటీ చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో దాదాపు సినీ పెద్దలందరూ పాల్గొన్నారు. నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్ వంటి వారంతా కదిలి వచ్చారు. సినీ కార్మికులను సరుకులను అందించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాత్రం కనిపించలేదు.

    వివరణ ఇచ్చిన మెగాస్టార్..

    వివరణ ఇచ్చిన మెగాస్టార్..

    తలసాని సేవా ట్రస్ట్ చేపట్టిన కార్యక్రమానికి తాను హాజరు కాలేకపోయానని చిరంజీవి చెప్పుకొచ్చాడు. తన ఇంటి సభ్యులు (ఉపాసన తాత కామినేని ఉమాపతి రావు) మృతి చెందిన కారణంగా అక్కడికి వెళ్లాల్సి వచ్చిందని అందుకే రాలేకపోయానని తెలిపాడు. తమకు ప్రభుత్వానికి అనుసంధాన కర్తగా ఉన్న మంత్రి తలసానికి ఎప్పుడూ రుణపడి ఉంటామని, ఇంత గొప్ప పని చేస్తున్నందుకు ధన్యవాదాలు అని పేర్కొన్నాడు.

    English summary
    Chiranjeevi About Not Attend Talasani Seva Trust Groceries Distribution Event. Talasani srinivas yadav Distributing groceries To Cine Workers. Cinematography Minister YadavTalasani to help 14000 daily wage workers families belongs to TV, Cinema industry with groceries from Thursday
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X