twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘వకీల్ సాబ్‌’పై చిరు కామెంట్.. రివ్యూ ఇచ్చేందుకు మెగాస్టార్ ఆత్రుత!

    |

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎన్నో యేళ్ల నుంచి ఎదురుచూస్తోన్న తరుణం రాబోతోంది. వకీల్ సాబ్ సినిమాతో పవన్ కళ్యాణ్ మరోసారి తన సత్తా చాటేందుకు రెడీ అయ్యాడు. రేపు వకీల్ సాబ్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్, బెనిఫిట్ షోలు, స్పెషల్ స్క్రీనింగ్ పేరిట వకీల్ సాబ్ రికార్డులు కొల్లగొట్టేలా కనిపిస్తోంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అందరికీ వకీల్ సాబ్ ఫీవర్ పట్టుకుంది.

    టికెట్ రేట్లపై..

    టికెట్ రేట్లపై..

    ఇక కొన్ని చోట్ల టికెట్ రేట్లు ఆకాశన్నంటుతున్నాయి. వీటిపై కొందరు పెదవి విరిచినా కూడా అభిమానులు మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదు. కరోనాను కూడా లెక్క చేయకుండా థియేటర్లతో సందడి చేసేందుకు బుకింగ్స్‌ మీద పడ్డారు. క్షణాల్లో టిక్కెట్లు బుక్ అవుతుండటం వకీల్ సాబ్ క్రేజ్‌కు నిదర్శనం.

    ఫస్ట్ డే కలెక్షన్లు..

    ఫస్ట్ డే కలెక్షన్లు..

    ఫస్ట్ డే కలెక్షన్లపై వకీల్ సాబ్ కన్నేశాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టే దిశగా మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ దెబ్బకు టాలీవుడ్‌లో సరికొత్త రికార్డు క్రియేట్ అయ్యేలా కనిపిస్తోంది. మొదటి రోజు వకీల్ సాబ్ లెక్కలు తేలాలంటే ఇంకొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

    మెగా హీరోలు సైతం..

    మెగా హీరోలు సైతం..

    వకీల్ సాబ్ కోసం మెగా ఫ్యాన్స్ కాదు.. మెగా హీరోలు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా వకీల్ సాబ్ కోసం ఎంతగా ఎదురుచూస్తున్నాడో అందరికీ తెలిసిందే. వకీల్ సాబ్ మీద చిరు వేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

    వకీల్ సాబ్ మీద చిరు కామెంట్స్..

    వకీల్ సాబ్ మీద చిరు కామెంట్స్..

    చాలా కాలం తరువాత పవన్ కళ్యాణ్‌ని వెండితెర మీద చూడటానికి మీలానే నేను కూడా ఎదురుచూస్తున్నాను., అమ్మ, కుటుంబ సభ్యులతో రేపు సాయంత్రం థియేటర్‌లో వకీల్ సాబ్ చూస్తున్నాం. సినిమా మీద నా అభిప్రాయాన్ని చెప్పాలని ఎంతో ఆత్రతుగా ఎదురుచూస్తున్నాను.. స్టే ట్యూన్డ్ అని చిరు చెప్పుకొచ్చాడు.

    English summary
    Chiranjeevi About Pawan kalyan Vakeel saab Release..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X