twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అందుకే నిహారిక టార్గెట్ అవుతోందా? రూమర్లపై చిరంజీవి అప్‌సెట్

    By Bojja Kumar
    |

    గత కొన్ని నెలలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ బాహుబలి ప్రభాస్ పెళ్లి. దీని గురించి చాలా కాలంగా టాలీవుడ్లో చర్చ సాగుతోంది. అభిమానులైతే ఈ వేడుక ఎప్పుడు చూద్దామా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అభిమానులు మాత్రమే కాదు, ప్రభాస్ ఫ్యామిలీ కూడా ప్రభాస్ పెళ్లికి ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా? అని వెయిట్ చేస్తోంది.

    అందరినీ షాక్‌కు గురి చేసిన రూమర్

    అందరినీ షాక్‌కు గురి చేసిన రూమర్

    ప్రభాస్ గురించి, అతడి పెళ్లి గురించి ఇప్పటి వరకు చాలా రూమర్స్ వినిపించాయి. అప్పట్లో అనుష్కతో పెళ్లి అంటూ ప్రచారం జరిగింది. అయితే అవేవీ అభిమానులను, ఫ్యామిలీ మెంబర్స్ ను షాక్‌కు గురి చేయలేదు. అయితే మెగా డాటర్ నిహారికతో ప్రభాస్ పెళ్లి అనే రూమర్ అందరినీ షాకయ్యేలా చేసింది.

    నిహారిక ఎందుకు టార్గెట్ అవుతోంది?

    నిహారిక ఎందుకు టార్గెట్ అవుతోంది?

    ఈ మధ్య కాలంలో మెగా ఫ్యామిలీ నుండి నిహారిక ఎక్కువ టార్గెట్ అవుతోంది. బహుషా ఆమె హీరోయిన్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడమే అందుకు కారణం అయుండొచ్చు. కొన్ని రోజుల క్రితం కూడా నిహారిక-సాయి ధరమ్ తేజ్ పెళ్లి అంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

    చిరంజీవి అప్ సెట్

    చిరంజీవి అప్ సెట్

    తన ఫ్యామిలీ ప్రాణంగా ప్రేమించి చిరంజీవి తన కూతురు తర్వాత కూతురైన నిహారిక మీద ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ అవ్వడంపై అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. ఇటీవల ప్రభాస్ తో పెళ్లి అనే రూమర్స్ వినగానే వెంటనే ఖండించారు. ఇవన్నీ నిరాధారమైనవి కొట్టిపారేసినట్లు తెలుస్తోంది. ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ అవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వీటిని అస్సలు సహించ కూడదని ఆయన కుటుంబ సభ్యులకు సూచించినట్లు సమాచారం.

    సినిమాలతో నిహారిక బిజీ అవుతోంది

    సినిమాలతో నిహారిక బిజీ అవుతోంది

    ఒక మనసు' సినిమా ద్వారా తెరంగ్రేటం చేసిన నిహారిక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు. నిహారిక ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న 'ఓరు నల్ల నాల్ పాతు సొల్రెన్' అనే చిత్రంలో నటిస్తోంది.

    English summary
    Megastar Chiranjeevi has rubbished rumors of Prabhas-Niharika marriage as baseless. To a leading channel, Chiru said there is no truth to these reports. There is still ample time for Niharika to get married.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X