twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెగా అప్‌డేట్ : అంగీకరించిన రాజమౌళి.. తండ్రీ కొడుకు పాత్ర కాదు.. చిరు కామెంట్స్

    |

    మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోతోన్న చిత్రంపై ఎన్ని అంచనాలున్నాయో మాటల్లో చెప్పలేం. ఓ కమర్షియల్ సినిమాకు ఉండాల్సిన అన్నీ అంశాలు ఉంటూనే ఓ సందేశాన్ని ఇవ్వడం లాంటి ఫార్మూలాతో తిరుగులేని కొరటాల.. చిరును ఎలా చూపిస్తాడా? అని ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే లీకైన పిక్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ మూవీపై నిత్యం ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. తాజాగా ఈ సినిమా గురించి చిరంజీవి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. అవేంటో ఓ సారి చూద్దాం.

    ఓ స్పెషల్ క్యారెక్టర్..

    ఓ స్పెషల్ క్యారెక్టర్..

    ఆచార్య అంటూ నోరు జారి సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేసేశాడు చిరంజీవి. ఈ మూవీలో మరో ముఖ్యమైన పాత్ర ఉందని, ఆ క్యారెక్టర్‌కు రామ్ చరణ్ అయితే బాగుంటుందనే ఆలోచనలో ఉంది చిత్రయూనిట్. మధ్యలో మహేష్ బాబును తీసుకున్నారని రూమర్స్ తెగ హల్చల్ అయ్యాయి. రెమ్యూనరేషన్ కూడా ఫిక్స్ అయిందని వార్తలు చక్కర్లు కొట్టాయి.

    ఆ పేరు ఎలా వచ్చిందో..

    ఆ పేరు ఎలా వచ్చిందో..


    అయితే తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన చిరు వీటిపై క్లారిటీ ఇచ్చాడు. అసలు మహేష్ బాబు పేరు ఎందుకు వచ్చిందో తమకు తెలియదని చెప్పుకొచ్చాడు. మొదటి నుంచి ఆ పాత్రకు రామ్ చరణ్‌ను తీసుకుందామనే ఆలోచనలోనే ఉన్నామని రూమర్స్‌కు పుల్ స్టాప్ పెట్టేశాడు.

    అంగీకరించిన రాజమౌళి..

    అంగీకరించిన రాజమౌళి..

    అయితే రాజమౌళి ఒప్పుకుంటేనే అది సాధ్యపడుతుందని తెలిపాడు. అయితే తాజాగా చిరు చెప్పిన సమాచారం మేరకు రాజమౌళి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఓ నెలరోజుల పాటు ఆర్ఆర్ఆర్‌ నుంచి రామ్ చరణ్‌కు బ్రేక్ ఇచ్చేందుకు జక్కన్న ఒప్పుకున్నాడట. ఇక రామ్ చరణ్ ఆచార్యలో కనిపించడమనేది ఫిక్స్.

    Recommended Video

    Akira Nandan Enormous Craze In Social Media
    గురు శిష్యుల పాత్ర..

    గురు శిష్యుల పాత్ర..


    ఆచార్యలో రామ్ చరణ్ నటిస్తుండటం నిశ్చయం కావడంతో తమ పాత్ర తీరు తెన్నెలపైనా స్పందించాడు. ఇందులో తమది తండ్రీ కొడుకుల పాత్రలు కావని ఓ రకంగా గురు శిష్యుల సంబంధం లాంటిదని ఓ చిన్న హింట్ ఇచ్చాడు. మరి వీరిద్దరు కలిసి నటిస్తే అభిమానుల రియాక్షన్ ఎలా ఉంటుందో ఊహించడం కష్టమే.

    English summary
    Chiranjeevi About Ram Charan Role In Acharya. Chiranjeevi Says That Recently They Met rajamouli For Ram Charan dates. Rahamouli agreed For Ram Charan. And They Are Not Playing father And Son Roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X