twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ ఒక్క మాటతో ఎంతో బాధ.. ఎస్పీబీపై చిరంజీవి ఎమోషనల్

    |

    స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్ని ప్రభుత్వం భారత దేశ రెండో అత్యున్నత పురస్కారంతో సరైన నివాళిని అర్పించింది. ప్రతీ ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులు ప్రకటిస్తారు. ఈ క్రమంలో ఈ ఏడాదిగానూ ప్రకటించిన పద్మ అవార్డుల్లో రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్‌ను ఎస్పీబీకి ప్రకటించారు. ఈక్రమంలో టాలీవుడ్ ప్రముఖులందరూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

    Recommended Video

    Gang Leader Brothers Reunion In Acharya Sets | Megastar Chiranjeevi | Filmibeat Telugu

    ఫోటోలు: గణతంత్ర దినోత్సవం రోజున ఉద్రిక్తంగా మారిన కిసాన్ ర్యాలీ

    మరణానంతరం..

    మరణానంతరం..

    పద్మ అవార్డులను వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ప్రధానం చేస్తుంటారు. అలా అందులో కొంత మందికి మరణించిన తరువాత సైతం పద్మ అవార్డులను ప్రకటిస్తారు. ఈ సారి అలా మరణానంతరం పద్మ అవార్డుల వరించిన వారు కూడా ఉన్నారు. అందులో ఎస్పీబీకి పద్మ విభూషణ్ వరించింది.

    గతేడాది..

    గతేడాది..

    ఎస్పీబీ పాటల ప్రోగ్రాంలో పాల్గొనడం, అలా కరోనా రావడం, చివరకు లోకాలను వదిలి వెళ్లడం అందరికీ తెలిసిందే. కరోనా నుంచి కోలుకుంటున్నారనే శుభవార్త వచ్చినా కూడా చివరకు ఇతర సమస్యలు వెంటాడటంతో అభిమానులను ఒంటరి చేసి కన్నుమూశారు. అయితే ఇప్పుడు ఎస్పీబీకి సరైన నివాళి అర్పించారు.

    పద్మ అవార్డ్‌పై..

    పద్మ అవార్డ్‌పై..

    ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్ రావడంతో అందరూ సంతోషాన్నివ్యక్తం చేశారు. మరీ ముఖ్యంగా తెలుగు చిత్ర సీమ నుంచి ఎంతో మంది ప్రముఖులు తమ సంతోషాన్ని వ్యక్తంచేశారు. అయితే గాయని చిత్రకు కూడా పద్మ భూషణ్ పురస్కారం లభించింది.

    చిరు ఎమోషనల్..

    చిరు ఎమోషనల్..

    సోదర సమానుడిగా భావించి ఎస్పీబీకి పద్మ విభూషణ్ ప్రకటించడంతో చిరు ఎమోషనల్ అయ్యాడు. ఆ పురస్కారానికి ఎస్పీబీ అర్హుడే. అయితే మరణానంతరం అనే పదం చూసి మాత్రం ఎంతో బాధగా అనిపిస్తుంది. కానీ అది మనం జీర్ణించుకోవాల్సిన విషయమే అని చిరు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

    మొత్తంగా అలా..

    మొత్తంగా అలా..

    ఈ ఏడాదికి గానూ మొత్తంగా పద్మ విభూషణ్‌ను ఏడుగురికి, మూడో అత్యున్నత పురస్కారమైన పద్మ భూషన్‌ను పది మందికి, పద్మ శ్రీని 102 మందికి ప్రకటించింది. ఎస్పీబీ బాలసుబ్రహ్మణ్యంకు గతంలో 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్‌లు వరించాయి.

    English summary
    Chiranjeevi About SPB honoured with Padma Vibhushan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X