twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇంట్లో నలుగురికి కరోనా.. సురేఖ చెయ్యి వెయ్యనివ్వడం లేదు.. చిరు కామెంట్స్ వైరల్

    |

    ప్రస్తుతం మన దేశంలో, మన రాష్ట్రంలో కరోనా తాండవం చేస్తోంది. రోజుకు కొన్ని వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా రోగులను కాపాడేందుకు ప్లాస్మా ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది. కరోనా సోకి కోలుకున్న వారి నుంచి సేకరించిన ప్లాస్మాతో ఇంకొంతమందిని రక్షించే అవకాశం ఉంది. అందుకే ప్రస్తుతం అందరూ ప్లాస్మా దానం గురించి అవగాహన కల్పించేందుకు ముందుకు వస్తున్నారు. ఈ సందర్బంగా సీపీ సజ్జనార్ నిర్వహించిన కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి వచ్చి.. తన సొంత అనుభవం, ప్లాస్మా దానం ప్రాముఖ్యతను వివరించారు.

     ఇంట్లో కరోనా..

    ఇంట్లో కరోనా..

    మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో నలుగురికి కరోనా వచ్చింది. ఈ మేరకు చిరంజీవి మాట్లాడుతూ.. ‘నా ఇంట్లో నా దగ్గర పనిచేసే.. నలుగురు వర్కర్స్‌కి కరోనా వచ్చి.. రికవరీ అయ్యారు. నెలన్నర క్రితం వాళ్లకి కరోనా రాగా.. రెండుసార్లు నెగిటివ్ టెస్ట్ చేయించుకుని వాళ్లని తిరిగి మా ఇంట్లోకి రప్పించి పనిచేయించికోవడం మొదలు పెట్టామ'ని తెలిపారు.

    అందుకే తీసుకొచ్చా..

    అందుకే తీసుకొచ్చా..

    ‘అందుకే వాళ్లతో ప్లాస్మా దానం చేయించాలని తీసుకుని వచ్చా. వీళ్లు ఒక్కసారి ఇస్తే కనుక ముగ్గురు ప్రాణాలను కాపాడినట్టు అవుతుంది. బిడ్డల్ని కన్న ఆ మహిళ ప్లాస్మా దానం చేయకూడదని అంటున్నారు. కాని ఆమె కూడా ఇవ్వడానికి రెడీ అయ్యింది' అంటూ ఆ నలుగుర్నీ మీడియా ముందుకు తీసుకుని వచ్చి ప్లాస్మా డొనేషన్‌పై అవగాహన కల్పించారు.

    ప్రసంగం మొత్తం సరదాగా..

    ప్రసంగం మొత్తం సరదాగా..

    చిరంజీవి తన ప్రసంగాన్ని సరదాగా కొనసాగించారు. మధ్య మధ్యలో తనపై తానే జోకులు వేసుకున్నారు. తన స్వంత అనుభవాలు చెప్పి అందర్నీ నవ్వించారు. ఈ సందర్భంగా చిరు తన సతీమణితో జరిగిన ఘటనను కూడా వివరించారు. దాంతో అక్కడున్న వారంతా ఫక్కున నవ్వేశారు.

     మధ్యలో అలా..

    మధ్యలో అలా..

    చిరు ప్రసంగ సమయంలో మధ్యలో కాస్త దగ్గుతో ఇబ్బంది పడ్డారు. వెంటనే ఉన్న పోలీస్ అధికారి నీళ్లు అందించారు. ఈ సందర్భంగా చిరు కాస్త ఫన్ క్రియేట్ చేశారు. ‘కరోనా సమయంలో ఎవరైనా దగ్గితే భయం వేస్తోంది. ఇప్పుడు నేను దగ్గుతున్నానని భయపడకండి' సెటైర్ వేశారు.

    Recommended Video

    Pawan Kalyan, Chiranjeevi, Bandla Ganesh Green India Challenge
    సరదాగా చెయ్యి కూడా..

    సరదాగా చెయ్యి కూడా..

    ఆపై ఇంకా మాట్లాడుతూ.. ‘చిన్న దగ్గు దగ్గినా, ఎలర్జీతో తుమ్ములు వచ్చినా పక్కన వాళ్లు దూరం జరిగిపోతున్నారు. ఖర్మ .. ఇంటికి వెళ్లి సురేఖపై సరదాగా చెయ్యి వేసినా.. తను కూడా దూరం జరిగిపోతోంది. అందరి మధ్యా భౌతిక దూరం ఉండొచ్చు కానీ.. భార్యాభర్తల మధ్య కూడా ఉండాల్సి వస్తోంద'ని అందర్నీ నవ్వించారు.

    English summary
    Chiranjeevi About Surekha On Covid 19 Situation in His Home. Chiranjeevi creates Awareness On Plasma Donation. And He Recalled His Own Experience About Corona.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X