మెగాస్టార్ ఆచార్య అప్‌డేట్స్: మహేష్ బాబు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
టాలీవుడ్‌లో 80వ దశకంలో మల్టీ స్టారర్లకు కొదవ లేకుండా ఉండేది. మారుతున్న పరిస్థితులు, సమీకరణాల దృష్ట్యా స్టార్ హీరోలు మల్టీ స్టారర్లకు దూరంగా ఉన్నారు. కానీ ఇప్పుడు మళ్లీ పాత రోజులే ముద్దు అన్నట్టు హీరోలు సహచర హీరోలతో కలిసి నటించేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఇటీవల కాలంలో సీతమ్మ వాకిట్టో సిరిమల్లె చెట్టు నుంచి త్వరలో రాబోతున్న RRR సినిమా వరకు పెద్ద హీరోలు వెండితెరపైన కలిసిపోవడానికి సంసిద్ధమవుతున్నారు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి, సూపర్‌స్టార్ మహేష్ కొరటాల శివ సినిమాలో నటిస్తున్నారనే వార్త దక్షిణాదిని కుదిపేసింది. అయితే మల్టీస్టారర్ అనే విషయాన్ని పక్కన పెడితే.. మహేష్ బాబు తీసుకొనే రెమ్యునరేషన్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈ సినిమా కోసం ఎంత తీసుకొంటున్నారంటే..

సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత
సరిలేరు నీకెవ్వరు సినిమా బ్లాక్‌బస్టర్‌తో మంచి జోష్ మీద ఉన్న మహేష్ బాబు.. వాస్తవానికి వంశీ పైడిపల్లి సినిమాలో నటించాల్సింది. అయితే ఊహించని విధంగా వంశీ పైడిపల్లి సినిమా వెనక్కు పోవడం.. కొరటాల శివకు మహేష్ ఓటేయ్యడం చకచకా జరిగిపోయాయి. అయితే వంశీ పైడిపల్లి సినిమా కథ విషయంలో మహేష్ అసంతృప్టిగా ఉండటం, అలాగే కథలో మార్పులు సూచించడం వల్ల ఆ ప్రాజెక్ట్ వెనకకుపోయినట్టు తెలిసింది.

కొరటాలకు గ్రీన్ సిగ్నల్
మహేష్ బాబు వెంటనే చేయడానికి చేతిలో ప్రాజెక్ట్ లేకపోవడంతో ఏం చేయాలని ఆలోచిస్తున్నపుడు కొరటాల ప్రాజెక్ట్ ముందుకొచ్చింది. కొరటాల శివ సినిమాలో ఓ యువ నాయకుడి పాత్రను ఎన్టీఆర్, రాంచరణ్ చేయలేకపోవడంతో ఆ పాత్రను చేయడానికి మహేష్ ఉత్సాహం చూపడంతో మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు కాంబినేషన్ సెట్ అయింది. దీంతో ఇద్దరు హీరోల ఫ్యాన్స్‌లో ఆనందం వ్యక్తమైంది.

ఆచార్య కోసం చిరంజీవి..
ప్రస్తుతం కొరటాల శివ సినిమా పేరు ఆచార్య అని ఓ పిట్ట కథ మూవీ ఫంక్షన్‌లో టైటిల్‌ను చిరంజీవి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం కోకాపేట్‌లో వేసిన ప్రత్యేక సెట్‌లోనూ, అలాగే రామోజీ ఫిలిం సిటీలో శరవేగంగా పూర్తి చేసుకొంటున్నది. చిరంజీవిపై ప్రధాన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాలో లుక్ కోసం చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటున్నారనే విషయం స్పష్టమైంది. ఇటీవల లీక్ అయిన చిరంజీవి గెటప్ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.

జూన్ నుంచి మహేష్ షూటింగ్
ఇక జూన్ నుంచి మహేష్ బాబు ఆచార్య సినిమా షూటింగ్‌లో పాల్గొంటారనేది చిత్ర యూనిట్ తెలిపింది. జూన్ వరకు చిరంజీవిపైనే ప్రధాన సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలిసింది. ఇక యువ విద్యార్థి నాయకుడి పాత్రలో కనిపించేందుకు
మహేష్‌బాబు గెటప్ పరంగా కసరత్తులు ఇప్పటికే ప్రారంభించారట. ఈ చిత్రం కోసం మహేష్ బాబు సుమారు 30 రోజులపాటు కేటాయించారని, ఆ మేరకు షూటింగ్‌లో పాల్గొంటారని తాజా సమాచారం.
Recommended Video


మహేష్‌బాబు పారితోషికం ఎంతంటే
ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమా కోసం మహేష్‌బాబు భారీగా పారితోషికం ముట్టనున్నట్టు సమాచారం. ఈ సినిమాకు కేటాయించిన 30 రోజుల కోసం మహేష్ రోజుకు కోటి రూపాయలు తీసుకొంటున్నట్టు.. మొత్తంగా ఈ సినిమా కోసం 30 కోట్లు రెమ్యునరేషన్ అందుకోనున్నట్టు తెలిసింది. ఇదిలా ఉండగా, సరిలేరు నీకెవ్వరు సినిమా కోసం మహేష్ బాబు సుమారు. 40 కోట్లకుపైగానే పారితోషికం అందుకొన్నట్టు తెలిసింది.


Click it and Unblock the Notifications











