ఆచార్య టీజర్ రచ్చ.. సోషల్ మీడియాలో అరాచకం.. చిరు స్టామినా అదే
మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని, సామాజిక సందేశమున్న చిత్రాన్ని తెరకెక్కిస్తున్నానని కొరటాల శివ ఎప్పుడో ప్రకటించాడు. అయితే మాటలు బాగానే ఉన్నాయి.. కానీ చిరంజీవిని ఎలా చూపిస్తాడా? అని అందరూ ఎదురుచూడసాగారు. టైటిల్ పోస్టర్ కూడా ఎన్నో రోజులకు విడుదల చేశారు. అసలు చిరంజీవి ఎలా ఉంటాడు.. ఎలా కనిపించబోతోన్నాడంటూ అందరిలోనూ రేకెత్తి ఆసక్తి, అంచనాలు తగ్గట్టుగా నేటి టీజర్‌తో సమాధానం ఇచ్చాడు.

టీజర్ రచ్చ..
ఆచార్య టీజర్‌తో కొరటాల తన విజన్‌ను చూపించాడు. చిరంజీవిని వెండితెరపై ఎలా చూపించబోతోన్నాడో శాంపిల్‌గా టీజర్‌ను వదిలాడు. టీజర్‌లో ఉన్న ప్రతీ షాట్, ఎలివేషన్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇలా ప్రతీ ఒక్కటి కూడా ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయించేలా ఉన్నాయి.

పంచ్ డైలాగ్‌లు సైతం..
కొరటాల సినిమాలు అంటే డైలాగ్స్‌లో చాలా లోతు, ఇంటెన్సిటీ ఉంటాయి. అలాగే ఇందులో ఎంతో హుందాగా డైలాగ్ చెబుతూనే అందులో చిరు స్టైల్ వెటకారాన్ని కూడా జోడించాడు. అలా చివర్లో చెప్పిన 'పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా.. ఆచార్య అంటుంటారు.. గుణపాఠాలు చెబుతానని అలా అంటారేమో' అనే డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటోంది.

సోషల్ మీడియాలో వైరల్..
ఆచార్య టీజర్ ప్రారంభంలో రామ్ చరణ్ వాయిస్ కూడా అందరినీ ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ మాత్రం అదిరిపోయేలా ఉన్నాయని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. అలా ప్రస్తుతం ఈ టీజర్ మిలియన్ల వ్యూస్‌ను కొల్లగొడుతోంది.

మిలియన్ల వ్యూస్‌తో..
ఆచార్య టీజర్ ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పటికే మూడు మిలియన్ల వ్యూస్‌ను కొల్లగొట్టింది.. దాంతో పాటే 300k లైకులను సాధించేసింది. ఇలా టీజర్ రిలీజ్ చేసిన అతి కొద్ది గంటల్లోనే రికార్డుల మోత మోగుతోంది. ఏది ఏమైనా చిరు స్టామినాకు నిదర్శనంగా ఆచార్య టీజర్ నిలిచింది.

విడుదలయ్యేది అప్పుడే..
మెగా అభిమానులకు బ్యాక్ టు బ్యాక్ అప్టేట్లు ఇచ్చారు. ఆచార్య టీజర్ విడుదల చేసిన కొద్ది సేపటికే మరో అప్డేట్ ఇచ్చారు. ఆచార్య వేసవి కానుకగా.. మే 13న విడుదల కాబోతోందని ప్రకటించారు. దీంతో మెగా అభిమానులు బాక్సాఫీస్ పని పట్టేందుకు రెడీగా ఉన్నామంటూ కామెంట్లు పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











