For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కోడి రామకృష్ణ కూతురి వివాహం.. హాజరైన చిరు, బాలయ్య

  |
  Chiranjeevi And Balakrishna Together At Kodi Ramakrishna Daughter's Marriage

  టాలీవుడ్ దర్శకుల్లో కోడి రామకృష్ణది ప్రత్యేక శైలి. తెలుగు చిత్రసీమలో ఎన్నో ప్రయోగాలు చేసి.. అద్భుతమైన విజయాలు అందుకున్న దర్శకుడు కోడి రామకృష్ణ. దాదాపు నాటి హీరోలందరికీ బ్లాక్ బస్టర్ హిట్‌లను ఇచ్చాడు. లేడీ ఓరియెంటెడ్, భక్తి రస చిత్రాల్లో అప్పట్లోనే గ్రాఫిక్స్‌ను అత్యద్భుతంగా వాడి టెక్నాలజీని టాలీవుడ్‌కు పరిచయం చేశాడు.

  చిరు, బాలయ్యలకు మరుపురాని హిట్స్..

  చిరు, బాలయ్యలకు మరుపురాని హిట్స్..

  చిరంజీవి డిఫరెంట్ పాత్రలో చూపిస్తూ.. కొంచెం నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రను పోషించిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. అప్పటి నుంచి దర్శకుడిగా వెనుదిరిగి చూసుకోలేదు. వరుసగా హిట్ల మీద హిట్లు కొట్టాడు. చిరు కెరీర్‌లో ఆలయ శిఖరం, గూఢచారి నెం.1లాంటి బ్లాక్ బస్టర్ హిట్‌లను అందించాడు. నందమూరి బాలకృష్ణ, కోడిరామకృష్ణలది హిట్ కాంబినేషన్. వీరిద్దరి కాంబోలో మంగమ్మ గారి మనవడు, ముద్దుల కృష్ణుడు, మువ్వ గోపాలుడు, భారతంలో బాలచంద్రుడు, ముద్దుల మావయ్యలాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. వీరి కాంబినేషన్‌కు తెలుగు ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు.

  హీరోల ఇమేజ్ మార్చే దర్శకుడు..

  హీరోల ఇమేజ్ మార్చే దర్శకుడు..

  వెంకటేష్‌కు శ్రీనివాస కళ్యాణం, శత్రువు లాంటి సినిమాలు ఇవ్వగా.. రాజశేఖర్‌కు యాంగ్రీ యంగ్‌మెన్ ట్యాగ్‌ను ఇచ్చాడు. అంకుశం లాంటి సినిమాలో రాజశేఖర్ ఇమేజ్‌ను అమాంతం పెంచేశారు. ఇలా ప్రతీ ఒక్క హీరోకు వారి కెరీర్‌లో నిలిచిపోయే సినిమాలను తెరకెక్కించాడు.

  కోడిరామకృష్ణ కూతురి నిశ్చితార్థం..

  కోడిరామకృష్ణ కూతురి నిశ్చితార్థం..

  ప్రముఖ దర్శకులు స్వర్గీయ కోడి రామకృష్ణ రెండో కుమార్తె కోడి ప్రవల్లిక నిశ్చితార్థం సిహెచ్ మహేష్‌తో గత అక్టోబర్‌లో జరిగింది. పార్క్ హయత్‌లో వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ , విక్టరీ వెంకటేష్ , రెబల్ స్టార్ కృష్ణంరాజు, మురళీ మోహన్, జీవిత రాజశేఖర్, అల్లు అరవింద్, గంటా శ్రీనివాస్, ఎంఎస్ రాజు, దిల్ రాజు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరైన సంగతి తెలిసిందే.

  అంగరంగ వైభవంగా వివాహాం..

  అంగరంగ వైభవంగా వివాహాం..

  కోడిరామ‌కృష్ణ చిన్న కుమార్తె ప్ర‌వ‌ల్లిక వివాహం మ‌హేష్‌తో బుధ‌వారం రాత్రి 9.36 నిమిషాల‌కు హైదరాబాద్ గండిపేట‌లోని క‌న్వెష‌న్స్ అండ్ ఎగ్జిబిష‌న్స్ లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. కోడిరామ‌కృష్ణ స‌తీమ‌ణి కోడి ప‌ద్మ ఆహ్వానం మేర‌కు తెలుగు చ‌ల‌న‌చిత్ర ప్ర‌ముఖులు, రాజ‌కీయ ప్ర‌ముఖులు ఈ వివాహ వేడుక‌కు హాజ‌ర‌య్యారు.

  కదిలి వచ్చిన సినీ లోకం..

  కదిలి వచ్చిన సినీ లోకం..

  మెగాస్టార్ చిరంజీవి, నంద‌మూరి బాల‌కృష్ణ‌, మోహ‌న్ బాబు, మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాదవ్‌, మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు, కె.రాఘ‌వేంద్ర‌రావు, ముర‌ళీ మోహ‌న్‌, గోపీచంద్‌, జ‌య‌ప్ర‌ధ‌, జీవిత‌, దిల్ రాజు, కోదండ రామిరెడ్డి, కె.విజ‌య‌భాస్క‌ర్‌, బి.గోపాల్‌, అల్లు అర‌వింద్‌, ద‌ర్శ‌క నిర్మాత ఎం.ఎస్.రాజు, నంద‌మూరి రామ‌కృష్ణ‌, పోకూరి బాబూరావు, ప‌రుచూరి గోపాల‌కృష్ణ‌, దేవీప్ర‌సాద్‌, వీర‌శంక‌ర్‌, శివాజీరాజా, మారుతి, ముత్యాల సుబ్బ‌య్య‌, హీరో వినోద్‌కుమార్‌, కాశీ విశ్వ‌నాథ్‌, అలీ, హేమ‌, నాగ‌బాబు స‌తీమ‌ణి ప‌ద్మ‌జ‌, కుమార్తె నిహారిక‌, న‌టి శివ‌పార్వ‌తి, రాజ‌శేఖ‌ర్ కుమార్తె శివాని త‌దిత‌రులు తో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజ‌ర‌య్యారు.

  English summary
  Late Kodi Ramakrishna's Youngest Daughters Marraige Event. So Many Clebraties Attended Like Chiranjeevi, Balakrishna, Venkatesh, krishnamraju.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X