twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లక్ష మొక్కలు నాటే కార్యక్రమం.. ప్రారంభించిన చిరు, బోయపాటి

    |

    రాజ్యసభ సభ్యుడు, ఎంపీ జోగినిపల్లి సంతోష్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా సినీ సెలెబ్రిటీలు మొక్కలు నాటుతున్నారు. మూడో విడతను ప్రభాస్ చేత ప్రారంభించిన సంతోష్ దీన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అహర్నిశలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఎంతో మంది తారలు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ వంతుగా మొక్కలు నాటుతున్నారు. అయితే నేడు అతి పెద్ద కార్యక్రమాన్ని సినీ పెద్దలందరూ కలిసి ప్రారంభించారు.

    గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబిలీహిల్స్ క్లబ్ ప్రాంగణంలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, బోయపాటి శ్రీను అనిల్ రావిపూడి వంటి వారు పాల్గొన్నారు. ఈ మేరకు అందరూ మొక్కలు నాటారు. వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. ఈ మేరకు అనిల్ రావిపూడి సోషల్ మీడియాలో వేదికగా ఎమోషనల్ అయ్యాడు.

    Chiranjeevi And Boyapati Sreenu Planted trees In Haritha Haram

    'ఇలాంటి గొప్ప కార్యక్రమంలో పాల్గొని నా వంతుగా చిన్న పాత్రను నిర్వర్తించినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని సంతోష్ గారిని కోరుతున్నాను. ప్రతీ ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని రాబోయే తరాలకోసం పచ్చని ప్రపంచాన్ని నిర్మించాలని ఆశిస్తున్నా'ని అనిల్ రావిపూడి తెలిపాడు. ఇప్పటికే ఉప్పెన టీమ్, హీరోయిన్లు రష్మీక, రాశీ, రకుల్ వంటి వారంతా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు.

    English summary
    Chiranjeevi And Boyapati Sreenu Planted trees In Haritha Haram. Megastar KChiruTweets , Directors #BoyapatiSrinu, AnilRavipudi participated in first day of planting 1 lakh trees in Jubilee Hills area.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X