హైదరాబాద్ కోసం కదిలిన టాలీవుడ్.. బాలయ్య ముందడుగు.. చిరు, మహేష్ కోటి రూపాయల విరాళం

గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌ పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందో అందరికీ తెలిసిందే. ఎడతెరపి కురుస్తున్న వానలతో హైదరాబాద్ అతలాకుతలం అయిపోయింది. భాగ్య నగారాన్ని వర్షభీభత్సం ముంచేస్తుంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వీధులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. కాలనీలు, ఇళ్లల్లోంచి వరదలు పొంగి పొర్లుతున్నాయి. ఈ వరదల వల్ల ఎన్నో వేల కోట్ల నష్టం రాగా.. ఎంతో మంది తిండి లేక దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. హైద్రాబాద్‌కు అండగా నిలబడేందుకు టాలీవుడ్ కదిలింది.

Recommended Video

#HyderabadFloods:Tollywood Heros Donations,హైదరాబాద్‌ కోసం ముందుకొచ్చిన టాలీవుడ్..భారీగా విరాళాలు!!
బాలయ్య ముందడుగు..

బాలయ్య ముందడుగు..

హైదరాబాద్ వరద బాధితులకు కోటిన్నర రూపాయలను బాలయ్య విరాళంగా ప్రకటించాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి విరాళం అందించిన తొలి హీరో బాలయ్యే కావడం గమనార్హం. ఇక బాలయ్య ఇచ్చిన స్ఫూర్తితో మిగిలిన హీరోలందరూ ముందుకు వచ్చారు. వరుసగా విరాళాలు ప్రకటిస్తూ తమ గొప్ప మనసును చాటుకుంటున్నారు.

చిరు, మహేష్ కోటి..

చిరు, మహేష్ కోటి..

మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. వరద బాధితుల కోసం ప్రభుత్వం ముందుకు రావడం, వెంటనే నిధులు సమకూర్చడాన్ని హర్షించారు. తమ వంతు బాధ్యతగా కోటి రూపాయల విరాళాన్ని ప్రకటిస్తున్నామని చిరంజీవి, మహేష్ బాబు తెలిపారు.

నాగ్, ఎన్టీఆర్ యాభై లక్షలు..

నాగ్, ఎన్టీఆర్ యాభై లక్షలు..

హైదరాబాద్ వరద బాధితుల కోసం నాగార్జున యాభై లక్షలు, జూ ఎన్టీఆర్ యాభై లక్షలు విరాళంగా ప్రకటించారు. ఈ భారీ వర్షాలు, వరదల కారణంగా ఎంతో మంది నిరాశ్రయులు అయ్యారు.. దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వారిని కాపాడేందుకు ముందుకు వచ్చిన ప్రభుత్వ కృషిని అభినందిస్తున్నాం.. మా వంతు సాయంగా ఈ విరాళాలాన్ని ఇస్తున్నామని ప్రకటించారు.

విజయ్ దేవరకొండ అలా..

విజయ్ దేవరకొండ అలా..

మనం కేరళకు అండగా నిలబడ్డాం.. చెన్నైకి భరోసా ఇచ్చాం.. సైన్యానికి తోడుగా ఉన్నాం.. కరోనా సమయంలోనూ అందరం కలిసి పని చేశాం.. కానీ ఈ సారి మన సిటీ కోసం, మన వారికి కోసం చేతులు కలుపుదాం.. నేను నా వంతుగా పది లక్షలను సీఎం సహాయ నిధికి విరాళమిస్తున్నాను అని విజయ్ దేవరకొండ ట్వీట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X