చిరంజీవి, మహేశ్ బాబు ఊహించని వ్యాఖ్యలు.. మత్తు వదలరా 2పై ఎలాంటి రివ్యూ ఇచ్చారంటే!

గతంలో కంటే ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో సీక్వెల్ మూవీలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే, అందులో కొన్ని చిత్రాలకు మాత్రమే మంచి హైప్ ఏర్పడుతుంది. అలాంటి వాటిలో 'మత్తు వదలరా 2' మూవీ ఒకటి. ఆస్కార్ విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి కుమారుడు శ్రీ సింహా కోడూరి హీరోగా నటించిన 'మత్తు వదలరా' సినిమాకు ఇది కొనసాగింపుగా వచ్చిన విషయం తెలిసిందే.

శ్రీ సింహా కోడూరి హీరోగా నటించిన తాజా సినిమానే 'మత్తు వదలరా 2'. రితేష్ రానా దర్శకత్వంలో రూపొందిన ఫుల్ లెంగ్త్ ఫన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. దీనికితోడు ప్రచారం చిత్రాలకు మంచి స్పందన వచ్చింది. ఫలితంగా భారీ హైప్‌తో ఈ సినిమా గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి ప్రీమియర్స్ నుంచి డీసెంట్ టాక్‌తో పాటు రివ్యూలు కూడా వస్తున్నాయి.

Chiranjeevi and Mahesh Babu Review On Mathu Vadalara 2 Movie

'మత్తు వదలరా 2' మూవీకి అన్ని వర్గాల సినీ ప్రియులు ఫిదా అవుతున్నారు. అలాగే కొందరు సినిమా వాళ్లు కూడా మెచ్చుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే చాలా మంది స్టార్లు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తూ పోస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేశ్ బాబు సైతం ఈ మూవీపై ట్వీట్ చేశారు.

మెగాస్టార్ చిరంజీవి తాజాగా తన X (ట్విట్టర్) ఖాతాలో ' నిన్ననే 'మత్తు వదలరా - 2' చూశాను. ఈ మధ్య కాలంలో మొదటి నుంచి చివరిదాకా ఇంతలా నవ్వించిన సినిమా నాకు కనపడలేదు. చివరి టైటిల్స్‌ను కూడా వదలకుండా చూశాను. ఈ క్రెడిట్ అంతా రితేష్ రాణాకు ఇవ్వాలి. అతడి రాత, తీత, కోత, మోత, ప్రతీది చక్కగా బ్యాలెన్స్ చేస్తూ మనల్ని వినోద పర్చిన విధానానికి అభినందించకుండా ఉండలేము. హ్యాట్సాఫ్ రానా. నటీనటులకు శ్రీ సింహా కోడూరికి, ఫరియా అబ్దుల్లాకు, కాల భైరవకు ప్రత్యేకించి సత్యకు అభినందనలు. మంచి విజయాన్ని అందుకున్న మైత్రీ సంస్థ టీమ్‌కు అభినందనలు' అని చెప్పారు.

సూపర్ స్టార్ మహేశ్ బాబు సైతం తన ఖాతాలో 'మత్తు వదలరా 2 మూవీ పంచిన నవ్వులను పూర్తిగా ఆస్వాదించాను. సింహా కోడూరితో పాటు నటీనటుల అద్భుతంగా నటించారు. వెన్నెల కిశోర్ నువ్వు తెరపై కనిపించినప్పుడు నా కూతురు నవ్వు ఆపుకోలేకపోయింది. సత్య.. నువ్వు స్క్రీన్‌పై కనిపించిన ప్రతిసారీ మేమంతా పడిపడి నవ్వుకున్నాం. మీ అందరి అత్యుత్తమ నటనను చూసినందుకు సంతోషిస్తున్నా. టీమ్ మొత్తానికి అభినందనలు' అంటూ రాసుకొచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X