రజినీకి దాదా సాహెబ్ ఫాల్కే.. చిరు అలా పవన్ ఇలా.. టాలీవుడ్ సెలెబ్రిటీల రియాక్షన్
తలైవా రజినీకాంత్ పేరు ఇప్పుడు జాతీయస్థాయిలో ట్రెండ్ అవుతోంది. భారత సినీ రంగానికి ఇచ్చే అత్యున్నత పురస్కారం ఇప్పుడు రజినీకాంత్‌ను వరించింది. కేంద్రం తాజాగా రజినీకాంత్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించింది. దీంతో దేశం మొత్తం మరోసారి రజినీ పేరు మార్మోగిపోతోంది. భారత సినీ పరిశ్రమ నుంచి రజినీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్ పెద్దలు రజినీకి విషెస్ చెబుతూ ట్వీట్లు పెడుతున్నారు.

పూర్తి అర్హులు..
నా ప్రియమైన స్నేహితుడైన రజినీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిందని తెలియడంతో ఎంతో సంతోషంగా అనిపించింది. నిజంగా రజినీ ఈ అవార్డు అందుకోవడానికి పూర్తి అర్హులు.. ఆయన చిత్ర పరిశ్రమకి అందించిన సేవలను సాధారణమైనవి కావు.. మీకు దేవుడి అండ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అని చిరంజీవి ట్వీట్ వేశాడు.

ఇప్పటికీ గుర్తే..
రజినీకాంత్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడం ఎంతో సంతోషంగా అనిపించింది. తమిళ ప్రేక్షకులను నాలుగున్నర దశాబ్దాలుగా అలరిస్తున్న ఆయన ఈ పురస్కారానికి అన్ని విధాల అర్హులు. మా కుటుంబానికి ఆయన ఎంతో సన్నిహితులు. మా అన్నయ్య చిరంజీవితో కలిసి ఆయన నటించిన బంధిపోటు సింహం, కాళీ సినిమాలు ఇప్పటికి నాకు గుర్తే అంటూ పవన్ కళ్యాణ్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

అదీ నా ఫ్రెండ్ అంటే..
నా ఫ్రెండ్ రజినీకాంత్‌ను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. అదీ నా ఫ్రెండ్ అంటే. ఆయనకు ఇలాంటి పురస్కారాలెన్ని వచ్చినా తక్కువే. నాకు ఈ క్షణం ఎంతో గర్వకారణంగా ఉంది అంటూ మోహన్ బాబు తన సంతోషాన్ని అందిరితోనూ పంచుకున్నాడు.

సేవలు అసాధారణం..
రజినీకాంత్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడంపై మహేష్ బాబు స్పందించాడు. ఈ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉంది సర్.. కంగ్రాట్స్ అంటూ మహేష్ బాబు ట్వీట్ వేశాడు. మీరు సినీ పరిశ్రమకు చేసిన సేవలు సాధారణమైనవి కావు. మీరు నిజంగా ఎందరిలోనో స్ఫూర్తినింపారు అంటూ మహేష్ బాబు తన ఆనందాన్ని పంచుకున్నాడు.

సినీ రాజకీయ ప్రముఖులు..
రజినీకాంత్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడంతో సినీ రాజకీయ ప్రముఖులందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. భారత ప్రధాని మోదీ దగ్గరి నుంచి అందరూ కూడా రజినీకి విషెస్ చెబుతున్నారు. టాలీవుడ్ నుంచి అనేక సినీ ప్రముఖులు రజినీకి విషెస్ తెలుపుతున్నారు.


Click it and Unblock the Notifications











