జయసుధ ఇంట్లో వేడుక.. కదిలిన తారాగణం.. చిరు, పవన్, బాలయ్య పిక్స్ వైరల్

సహజ నటి జయసుధ పెద్ద కుమారుడు నిహార్ వివాహం ఘనంగా జరిగింది. ఫిబ్రవరి 26న ఢిల్లీలో అమృత్ కౌర్‌తో జరిగిన ఈ వేడుకలో కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. అయితే సినీ పరిశ్రమలోని పెద్దల కోసం ఇక్కడ గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌లో సినీ పెద్దలందరూ కదిలివచ్చారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇలా అందరూ ఈ వేడుకలో తళుక్కుమన్నారు.

చంద్రబాబుకు, జగన్‌కు ప్రత్యేక ఆహ్వానం..

చంద్రబాబుకు, జగన్‌కు ప్రత్యేక ఆహ్వానం..

తన కుమారుడు పెళ్లికి రావాల్సిందిగా.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుని జయసుధ ప్రత్యేకంగా ఆహ్వానించింది. చంద్రబాబుతో జయసుధ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లుకొట్టాయి. అయితే పెళ్లి వేడుకలు ఢిల్లీలో జరగడంతో టాలీవుడ్ హాజరుకాలేదని తెలుస్తోంది.

గ్రాండ్‌గా రిసెప్షన్..

గ్రాండ్‌గా రిసెప్షన్..

సినీ పరిశ్రమకు సంబంధించిన పెద్దలందర్నీ ఆహ్వానిస్తూ ఏర్పాటు చేసిన రిసెప్షన్ వేడుక అంగరంగవైభవంగా జరిగింది. ఈ వేడుకలో మంచు ఫ్యామిలీ, నందమూరి బాలకృష్ణ, నాగార్జున-అమల, నమ్రతా, కే రాఘవేంద్రరావు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇలా ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు.

చిరు, పవన్ హాజరు..

చిరు, పవన్ హాజరు..

ఈ వేడుకలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. నవదంపతులను ఆశీర్వాదించారు. దిల్ రాజు, టీ సుబ్బిరామిరెడ్డి, నరేష్, మురళీ మోహన్ ఇలా ఇండస్ట్రీ అంతా సందడి చేసింది.

కదిలిన నాటి తారలు..

కదిలిన నాటి తారలు..

ఈ వేడుకలో జయసుధ సహచర నటీమణులు, నాటి అందాల తారలు పాల్గొన్నారు. కుష్బూ, సుహాసిని వంటి హీరోయిన్లు సందడి చేశారు. మొత్తానికి ఈ రిసెప్షన్‌ వేడుక తారలతో నిండిపోయింది. ఈ ఈవెంట్‌కు సంబంధించిని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X