చిరంజీవి ఇటు.. పవన్ కళ్యాణ్ అటు! ఇద్దరూ ఇద్దరే.. ఎక్కడా తగ్గడం లేదు.. ఇష్యూ హాట్ టాపిక్
మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తెలుగు చిత్రసీమలో ఈ ఇద్దరికీ ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేక వివరణ అవసరమే లేదు. అయితే ఈ ఇద్దరి క్రేజ్‌ని క్యాచ్ చేసుకునేలా మరో ఇద్దరు స్టార్ హీరోలు పవర్ ఫుల్ స్కెచ్ వేశారు. ఈ విషయం ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అయింది. ఇంతకీ ఏంటా విషయం? ఎవరా స్టార్ హీరోలు? వివరాల్లోకి పోతే..

ఇద్దరూ ఇద్దరే.. ఎక్కడా తగ్గడం లేదు
ఎప్పటిలాగే ఈ సంక్రాంతికి టాలీవుడ్ నుంచి పెద్ద సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అందులో ముఖ్యమైనవి రెండు సినిమాలు. ఆ రెండే అల్లు అర్జున్- అల.. వైకుంఠపురములో, మహేష్ బాబు- సరిలేరు నీకెవ్వరు. ఈ రెండు సినిమాలు సంక్రాంతి పోరుకు సిద్ధమయ్యాయి. ప్రమోషన్స్‌లో కూడా ఇద్దరూ ఇద్దరే అన్నట్లుగా దూసుకుపోతూ ఎక్కడా తగ్గడంలేదు మహేష్ బాబు, అల్లు అర్జున్.

పాటల సందడి.. ఇరువురి అభిమానులకు పండగే
ఓ వైపు మహేష్ బాబు- సరిలేరు నీకెవ్వరు టీం, మరోవైపు అల్లు అర్జున్- అల.. వైకుంఠపురములో టీం.. తమ సినిమాల నుంచి పాటలు విడుదల చేస్తూ ఇద్దరు స్టార్ హీరోల అభిమానులకు ముందుగానే పండగ తెచ్చేస్తున్నారు. ఈ మేరకు ఈ రెండు సినిమాల నుంచి ఇప్పటిదాకా విడుదలైన అన్ని పాటలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. దీంతో ఇరు సినిమాల మధ్య పోటీ తీవ్రతరమైంది.

భారీ వేడుక.. చీఫ్ గెస్ట్ చిరంజీవి
ఇక ఇప్పటికే పలు అప్‌డేట్స్ ఇస్తూ దూకుడుగా వెళ్తున్న 'సరిలేరు నీకెవ్వరు' టీం భారీ ప్రీ రిలీజ్ వేడుకను ప్లాన్ చేసింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవిని చీఫ్ గెస్ట్‌గా ఆహ్వానించి మహేష్ అభిమానులతో పాటు మెగా అభిమానుల్లో జోష్ నింపారు డైరెక్టర్ అనిల్ రావిపూడి.

త్రివిక్రమ్ ఊరుకుంటాడా? పవన్‌తో ప్లాన్ రెడీ
దీంతో అల్లు అర్జున్- అల.. వైకుంఠపురములో డైరెక్టర్ త్రివిక్రమ్ 'సరిలేరు నీకెవ్వరు'ను ఢీ కొట్టేలా ప్లాన్ రెడీ చేశారట. ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వాళ్ళు అన్నయ్య చిరంజీవిని తీసుకొస్తే.. తాము తమ్ముడు పవన్ కళ్యాణ్‌ని తీసుకురాబోతున్నారట.

ఆ కిక్కే వేరప్పా.. మెగా ట్రీట్
త్రివిక్రమ్- పవన్ మధ్య ఉన్న స్నేహం కారణంగా పవన్ కూడా ఇందుకు ఓకే చెప్పారని తెలుస్తోంది. జనవరి మొదటివారంలోనే 'అల.. వైకుంఠపురములో' ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారని, ఇందుకు సంబందించిన వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారని తెలుస్తోంది. ఏదేమైనా అల్లు అర్జున్ ఫంక్షన్స్‌కి పవన్ వచ్చారంటే ఆ కిక్కే వేరప్పా.

పోటాపోటీ.. గెలుపెవరిదో!.
ప్రతీ ఏడాది కంటే ఈ ఏడాది సంక్రాంతి సినీ ప్రేక్షకులకు స్పెషల్‌గా మారింది. అల్లు అర్జున్- అల.. వైకుంఠపురములో, మహేష్ బాబు- సరిలేరు నీకెవ్వరు సినిమాల్లో విజయం ఏ సినిమాది. కలెక్షన్ల సునామీ ఎవరిది? అని కుతూహలంగా ఉన్నారు ప్రేక్షకులు.


Click it and Unblock the Notifications











