For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వీరత్వాన్ని మేల్కొలపమన్న పవన్: ఎమోషనల్‌‌ అయిన చిరంజీవి.. స్పెషల్ అనిపించుకుంటూ!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ప్రత్యేకమైన స్థానం ఉంది. దీనికి కారణం ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న స్టార్ హీరోలలో ఎక్కువ మంది ఆ కుటుంబానికి చెందిన వారే ఉన్నారు. మరీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎన్నో ఏళ్లుగా తమ హవాను చూపిస్తున్నారు. ప్రజాసేవ చేయాలనే ఉద్దేశ్యంతో ఇద్దరూ రాజకీయాల్లోకీ ప్రవేశించారు. ఆ తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. తాజాగా ట్విట్టర్‌లో వీళ్లు చేసిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. పవన్ వీరత్వాన్ని మేల్కొలపమంటే.. చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. ఆ వివరాలు మీకోసం!

  వకీల్ సాబ్‌గా వస్తున్న పవన్ కల్యాణ్

  వకీల్ సాబ్‌గా వస్తున్న పవన్ కల్యాణ్

  రాజకీయాల కోసం సినిమాలకు దూరమయ్యాడు పవన్ కల్యాణ్. సుదీర్ఘ విరామం తర్వాత ‘వకీల్ సాబ్' అనే సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నాడు. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో పవర్ స్టార్ లాయర్‌గా కనిపించనున్నాడు. దీనితో పాటు మరో మూడు చిత్రాలను కూడా లైన్‌లో పెట్టేశాడీ మెగా హీరో.

  ఆచార్య‌లా మారిన మెగాస్టార్ చిరంజీవి

  ఆచార్య‌లా మారిన మెగాస్టార్ చిరంజీవి

  రీఎంట్రీలో స్పీడు పెంచేసిన మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ‘ఆచార్య'లో నటిస్తున్నాడు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే, ఇందులో రామ్ చరణ్ కూడా కీలక పాత్రను పోషిస్తోన్న విషయం తెలిసిందే.

  పవర్ స్టార్ న్యూ ఇయర్ గిఫ్ట్ వచ్చింది

  పవర్ స్టార్ న్యూ ఇయర్ గిఫ్ట్ వచ్చింది

  నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పవన్ కల్యాణ్ తాజా చిత్రం ‘వకీల్ సాబ్' నుంచి స్పెషల్ సర్‌ప్రైజ్ వచ్చేసింది. ఇప్పటి వరకు లాయర్‌గానే దర్శనమిచ్చిన ఆయన.. ఫస్ట్ టైమ్ హీరోయిన్ శృతి హాసన్‌తో కలిసి ఉన్న పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. వాస్తవానికి ‘పింక్' సినిమాలో హీరో పాత్రకు జోడీ లేకపోయినా.. తెలుగులో మాత్రం దాన్ని క్రియేట్ చేశారు.

  తీవ్రంగా నిరాశ పరిచిన మెగాస్టార్ చిరు

  న్యూ ఇయర్ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘ఆచార్య' నుంచి ఏదైన సర్‌ప్రైజ్ వస్తుందేమో అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ, అభిమానుల ఆశలపై నీళ్లు చల్లింది చిత్ర యూనిట్. నూతన సంవత్సరం రోజు ఆ సినిమా నుంచి అప్‌డేట్ వస్తున్నట్లు ప్రకటించకపోవడంతో నిరాశకు లోనవుతున్నారు సినీ ప్రియులు. మరి ఏదైనా పోస్టర్ రిలీజ్ చేస్తారేమో చూడాలి.

  వీరత్వాన్ని మేల్కొలపమంటున్న పవన్

  నూతన సంవత్సరం సందర్భంగా పవన్ కల్యాణ్.. ‘ఎక్కడ వీరత్వం ఉండదో, అక్కడ పుణ్యం క్షీణిస్తుంది.. ఎక్కడ వీరత్వం ఉండదో, అక్కడ స్వార్థం జయిస్తుంది' అంటూ శ్రీ రాంధారి సింగ్ కవితలోని లైన్లను పోస్ట్ చేసిన ఆయన.. ‘ఈ కొత్త సంవత్సరం, మన జాతిలోని వీరత్వాన్ని మేల్కొలపాలని కోరుకుంటూ, అందరికి నా నూతన సంవత్సర శుభాకాంక్షలు' అని ట్వీట్ చేశాడు.

  Chiranjeevi Helps His Fan Financially For His Daughter's Wedding
  ఎమోషనల్‌‌ వీడియో షేర్ చేసిన చిరంజీవి

  ఎమోషనల్‌‌ వీడియో షేర్ చేసిన చిరంజీవి

  న్యూ ఇయర్ సందర్భంగా స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ‘థ్యాంక్యూ 2020.. మాకు ఓర్పును నేర్పావు. మా జీవితాలను మార్చావు. ప్రకృతి ఎంత విలువైందో అర్థమయ్యేలా చేశావు. వెల్ కమ్ టూ ది న్యూ ఇయర్. ఈ కొత్త సంవత్సరం అందరికి బాగుండాలి. బోలెడంత సంతోషాన్ని ఇవ్వాలి. మీ కలలన్ని నిజం కావాలి. అలాగే కొవిడ్ వ్యాక్సిన్ కూడా రావాలి. విష్ యూ ఏ వేరీ హ్యప్పీ హెల్తీ అండ్ ఫుల్ ఫిల్లింగ్ న్యూఇయర్' అని అందులో ఎమోషనల్‌గా మాట్లాడారు.

  English summary
  Megastar Chiranjeevi conveys emotional 2021 new year wishes. Mega star tweets Wishing a Very Happy, Healthy & Fulfilling New Year 2021 for you and all your dear ones! Sri Venkateswara Creations presents New Year gift to Power Star Pawan Kalyan fans.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X