twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పూలు, పళ్లు అంటూ దర్శకేంద్రుడిపై సెటైర్స్.. ఆ ఘరానా దర్శకుడు మీరే.. మెగా ట్వీట్ వైరల్

    |

    దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు, మెాగస్టార్ చిరంజీవి కాంబినేషన్‌లో ఎన్నో మరుపురాని చిత్రాలు వచ్చాయి. హిట్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ వచ్చాయి. అందుకే వీరి కాంబినేషన్‌కు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. చిరు-రాఘవేంద్రరావు మధ్య ఉన్న సాన్నిహిత్యం కూడా అందరికీ తెలిసిందే. బాబాయ్ అంటూ ముద్దుగా పిలుచుకునే వీరి కాంబినేషన్‌లో వచ్చిన ఘరానామొగుడు చిత్రానికి 28 ఏళ్లు నిండిన సందర్భంగా నాటి విశేషాలను పంచుకున్నారు.

    మొట్టమొదటి తెలుగు సినిమా..

    మొట్టమొదటి తెలుగు సినిమా..

    టాలీవుడ్ చరిత్రలో పది కోట్ల వసూళ్లు సాధించిన మొట్టమొదటి చిత్రంగా ఘరానా మొగుడు చిత్రం రికార్డులను క్రియేట్ చేసింది. అప్పట్లో ఘరానా మొగుడు రికార్డులను చూసి జాతీయ మీడియా కూడా నివ్వరెబోయింది. అంతటి బ్లాక్ బస్టర్ చిత్రానికి 28 ఏళ్లు నిండటంతో దర్శకుడు నాటి విశేషాలను పంచున్నాడు.

    సమయం మారొచ్చు..

    సమయం మారొచ్చు..

    రాఘవేంద్ర రావు సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ‘సమయం ముందుకు వెళ్లొచ్చు గానీ ఈ మూవీ షూటింగ్ జరిగిన రోజులు మాత్రం ఇంకా నా మైండ్‌లో అలానే ఉన్నాయి.. మెగాస్టార్ కెరీర్‌లో ప్రత్యేకమైన చిత్రం.. ఓ మైల్ స్టోన్ లాంటి సినిమా.. ఇది విడుదలై 28 ఏళ్లు అవుతున్నాయి.. నిర్మాత దేవీ వరప్రసాద్‌, చిత్రయూనిట్, కీరవాణికి ధన్యవాదాలు' అంటూ ట్వీట్ చేశాడు.

    నాటి సంగతులను పంచుకున్న దర్శకుడు..

    ఘరానా మొగుడు చిత్రానికి 28 ఏళ్లు నిండిన సందర్భంలో హరీష్ శంకర్ ట్వీట్ చేస్తూ.. మార్నింగ్ షోకు వెళ్తే సెకండ్ షోకు టికెట్స్ దొరికాయని తెలిపాడు. అప్పటికే రిపీట్ ఆడియెన్స్ వచ్చేశారు.. పోర్ట్ ఫైట్, సాంగ్ అయ్యేసరికి బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయ్యామని చెప్పుకొచ్చాడు. మెగాస్టార్ కెరీర్‌లో ఓ అద్భుతమైన చిత్రమని.. మాలో స్ఫూర్తి నింపినందుకు ధన్యవాదాలు గురూజీ అంటూ ట్వీట్ చేశాడు.

    Recommended Video

    Jr NTR's Kid Bhargava Ram Grabing Attention In Social Media
    పూలు, పళ్లు అంటూ సెటైర్స్..

    పూలు, పళ్లు అంటూ సెటైర్స్..

    దర్శకేంద్రుడి ట్వీట్‌కు స్పందించిన చిరంజీవి.. ‘ఈ మ్యాజిక్, ఘనత మీది సర్.. ఈ చిత్రం సృష్టించిన రికార్డ్స్ కంటే మీతో పని చేసిన ప్రతి రోజు ఓ మంచి మెమరీ.. ఆర్టిస్ట్స్‌ని పువ్వుల్లో (ఒక్కోసారి పళ్లలో) పెట్టి చూసుకుంటూ బెస్ట్ అవుట్ పుట్ రాబట్టుకున్న ఘరానా దర్శకుడు మీరు. కీరవాణి గారు.. నిర్మాత దేవీ వరప్రసాద్ గారు ఈ విజయానికి మూల స్థంభాల'ని ట్వీట్ చేశాడు.

    English summary
    Chiranjeevi And Raghavendra Rao Tweets About Gharana mogudu Completed 28 Years. They Recalled Their Memories While Working For Gharana Mogudu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X