పోటాపోటీగా తండ్రీ కొడుకులు.. చిరంజీవా? రామ్ చరణా?.. ఇకపై ఎవరిది ఆధిపత్యం!!
మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఓ విషయంలో పోటీ పడుతున్నాడు. ఏంటి ఆ ఇద్దరికీ పోటీ ఏంటి? ఏ విషయంలో ఆ పోటీ అని అనుకుంటున్నారా? బాక్సాఫీస్ రికార్డులని భ్రమ పడుతున్నారా? ప్రస్తుతం ఎలాంటి సినిమా అప్‌డేట్స్ కూడా లేవు.. మరి ఏ విషయంలో అయి ఉంటుందని జుట్టు పీక్కుంటున్నారా?. వారిద్దరూ పోటీ పడేది ట్విట్టర్ ప్రపంచంలోని అభిమానగణం గురించి. సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చి రెండు నెలలు అవుతుండగా.. వీరి పర్ఫామెన్స్, ఫాలోవర్స్ సంఖ్య అదిరిపోయింది.

దడదడలాడించిన మెగాస్టార్..
మెగాస్టార్ ట్విట్టర్ ప్రపంచలోకి ఎంట్రీ ఇచ్చాక కొత్త ఊతం వచ్చింది. ఊపిరి పీల్చుకో మాహిష్మతి అనే డైలాగ్‌లా.. ట్విట్టర్ కూడా కొత్త ఊపిరిని పీల్చుకుంది. ఒక్కో ట్వీట్.. ఒక్కో లెజెండ్‌కు బాణంలా గుచ్చుకుంది. మెగాస్టార్ కామెడీ టైమింగ్ నెటిజన్స్ ఫిదా అయ్యారు. చిరు పంచ్‌లకు సెలెబ్రిటీలు సైతం ఖంగుతిన్నారు.

ట్వీట్ల సంఖ్యలో భారీ తేడా..
ట్వీట్ల సంఖ్యలో చిరంజీవిదే పైచేయి. చిరంజీవి 112 ట్వీట్లు చేయగా.. చరణ్ 18 ట్వీట్లు మాత్రమే చేశాడు. సగటున చూసుకుంటే రోజుకో ట్వీట్ చేస్తున్నాడు చిరంజీవి. ఒక్కో ట్వీట్ ఒక్కోసంచనలంగా మారింది. ఇక మరోవైపు రామ్ చరణ్.. ట్విట్టర్‌ను అంతగా వాడటం లేదు. చిరు గ్రేస్, స్పీడ్‌లో చరణ్ ఏ మాత్రం సరితూగడం లేదు.

ఫాలోవర్స్ మాత్రం సరిసమానంగా..
రామ్ చరణ్ అంతగా యాక్టివ్‌గా ఉండకపోయినా.. ఫాలోవర్స్ మాత్రం బాగానే పెరిగారు. చిరంజీవికి దరిదాపుల్లోనే ఉంటూ తండ్రికి గట్టి పోటి ఇస్తున్నాడు. మొత్తంగా చిరు, రామ్ చరణ్‌కు ఇద్దరికీ ఐదు లక్షలకు పైగా ఫాలోవర్స్ వచ్చారు. ఇక మిలియన్ వైపు ఈ ఇద్దరూ దూసుకుపోతోన్నారు.
Recommended Video

మొదటగా ఎవరు?
చిరు, చరణ్ ఇద్దరిలో మొదటగా ఎవరు మిలియన్ మార్క్‌ను చేరుతారో చూడాలి. ఇక ఇప్పటికే మహేష్ బాబు (9.6)అత్యధిక ఫాలోవర్స్‌తో సౌతిండియాలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. మరి వీరిద్దరు ఇప్పుడే రంగంలోకి దిగారు. ఎవరు ఎంత వేగంగా దూసుకుపోతారో చూడాలి.


Click it and Unblock the Notifications











