Don't Miss!
- Finance
ఫిబ్రవరి తర్వాత బిట్‌కాయిన్ మొదటిసారి దారుణ పతనం
- Sports
RCB vs KKR: దంచికొట్టిన మాక్స్వెల్.. 27 బంతుల్లోనే డివిలియర్స్ ఫిఫ్టీ! కోల్‌కతాకు భారీ లక్ష్యం!
- News
‘తిరుపతి ఉపఎన్నిక పోలింగ్ రద్దుకు డిమాండ్: దొంగ ఓటర్లపై జగన్ సమాధానం చెప్పాలి’
- Lifestyle
కరోనా వ్యాక్సిన్ ముఖ్యంగా మహిళలకు ఎలాంటి దుష్ప్రభావాలు కలిగిస్తుందో మీకు తెలుసా?
- Automobiles
కారులో ఉన్న పాడిల్ షిఫ్ట్ ఫీచర్ యొక్క ప్రయోజనాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
‘ఆచార్య’ టీంకు షాక్.. మొదటి రోజే ఎదురుదెబ్బ.. లీకులపై చిరు ఆగ్రహం
మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాపై ఎంతటి అంచనాలున్నాయో అందరికీ తెలిసిందే. మొదట్లో అయితే చిరంజీవి మాత్రమే ఉన్నాడు కదా అని అనుకున్నారు. కానీ ఇప్పుడు అది మల్టీ స్టారర్‌గా మారిపోయింది. రామ్ చరణ్ కూడా ఓ పాత్రను పోషిస్తోన్నాడు. రామ్ చరణ్‌కు కూడా పాటలు, ఫైట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆచార్యలో ఇద్దరు హీరోలన్నమాట. అయితే ఇలా ఈ ఇద్దరూ కలిసి వస్తున్నారంటే అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

లీకుల బెడద..
భారీ భారీ వ్యయాలతో నిర్మిస్తోన్న చిత్రాలకు లీకులు తలనొప్పిగా మారుతున్నాయి. ఎంతో హైప్‌తో రాబోతోన్న చిత్రాల అప్డేట్లు, పోస్టర్లు, స్టిల్స్ అన్నీ ముందుగానే లీకవుతున్నాయి. ఆచార్య సినిమా కూడా ఈ లీకుల బెడద తప్పడం లేదు. మొదటి నుంచీ లీకులు ఆచార్యను దెబ్బకొడుతూనే ఉన్నాయి.

స్టిల్స్, టైటిల్..
చిరంజీవి స్టిల్ గతేడాది క్రితమే లీకైంది. మెడలో ఎర్ర తువ్వాలు ధరించి ఉన్న ఫోటో ఒకటి వచ్చింది. ఇక చిరంజీవి నేరుగా ఆచార్య సినిమా టైటిల్‌ను అందరి ముందే పొరబాటున లీక్ చేసేశాడు. ఇలా ప్రతీసారి ఆచార్య లీకుల వలలో చిక్కుకుంటూనే ఉంది.

ఇప్పుడు అలా..
ప్రస్తుతం ఆచార్య యూనిట్ ఇల్లందులోని బొగ్గు గనుల్లో ఉంది. ఇన్ని రోజులు మారెడుమిల్లిలోని అటవీ ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంది. ఈ రోజే మొదటి సారిగా ఇల్లందులో బొగ్గు గనుల్లో షూటింగ్ మొదలుపెట్టేసింది. అయితే మొదటి రోజే షూటింగ్ చేస్తోన్న యూనిట్‌కు పెద్ద దెబ్బ తగిలింది.

ఫోటోలు లీక్..
ఇక రామ్ చరణ్, చిరంజీవి మీద తెరకెక్కిస్తోన్న సీన్స్, వాటికి సంబంధించిన స్టిల్స్ నెట్టింట్లో దర్శనమిచ్చాయి. ఇందులో ఈ ఇద్దరూ కూడా నక్సలైట్ డ్రెస్సులను ధరించి కనిపిస్తున్నారు. మొత్తానికి ఇద్దరూ కూడా నక్సలైట్ పాత్రలనే పోషిస్తోన్న ఇలా లీకైంది.

చిరు ఆగ్రహం..
ఇల్లందు ఒపెన్ కాస్ట్ గనిలో చిత్రీకరణ ఫొటోస్ లీక్ అవ్వడంపై చిత్ర యూనిట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసుల వైఫల్యం కారణంగానే ఫోటోలు బయటకు వెళ్లాయని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో ఆచార్య షూటింగ్ స్పాట్‌లో భద్రత కట్టుదిట్టం చేసినట్టు తెలుస్తోంది.