Acharya Release Date: మెగా అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్.. పండుగ రోజే ఆచార్య విడుదల

సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి యమ జోష్‌తో కనిపిస్తున్నారు. ఇప్పటికే పలు చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ఆయన.. ఇప్పుడు మరికొన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే వరుసగా సినిమాల మీద సినిమాలను పట్టాలెక్కిస్తూ దూసుకుపోతున్నారు.

ఇక, ఇప్పటికే మెగాస్టార్ 'ఆచార్య' అనే సినిమాలో నటించారు. ఇందులో రామ్ చరణ్ కూడా కీలక పాత్రను చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ అనివార్య కారణాల వల్ల ఆలస్యం కావడంతో విడుదల పలుమార్లు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో మెగా అభిమానులను సర్‌ప్రైజ్‌ చేస్తూ తాజాగా 'ఆచార్య' మూవీ కొత్త విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

మెగా హీరోల కలయికలో ‘ఆచార్య'

మెగా హీరోల కలయికలో ‘ఆచార్య'

మెగాస్టార్ చిరంజీవి.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపొందతోన్న చిత్రమే 'ఆచార్య'. బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు నిర్మించాయి. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా చేస్తోన్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించాడు. ఈ చిత్రంపై భారీ స్థాయిలో అంచనాలున్నాయి.

అంచనాలకు తగ్గట్టే భారీ బిజినెస్

అంచనాలకు తగ్గట్టే భారీ బిజినెస్

మెగా హీరోలు ఇద్దరూ కలిసి నటిస్తోన్న సినిమా కావడంతో.. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా 'ఆచార్య' మూవీని రూపొందించారు. అందుకు అనుగుణంగానే కొన్ని రోజుల క్రితం విడుదలైన టీజర్, పాటకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఫలితంగా దీనికి అన్ని ప్రాంతాల్లో భారీ డీల్స్ జరిగినట్లు సమాచారం.

ఆచార్య సినిమా నేపథ్యం ఇదేనట

ఆచార్య సినిమా నేపథ్యం ఇదేనట

డైరెక్టర్ కొరటాల శివ సినిమాలు అంటేనే సందేశాత్మకంగా ఉంటాయి. ఇప్పుడు 'ఆచార్య' కూడా అదే పంథాలో సాగే చిత్రమని తెలుస్తోంది. దేవాదాయ భూముల ఆక్రమణల నేపథ్యానికి నక్సలిజాన్ని జోడించి దీన్నీ రూపొందించారు. ఇందులో చరణ్, చిరంజీవి ఇద్దరూ నక్సలైట్లుగా నటించారు. ఓ మిషన్‌లో భాగంగా సిద్ధ పాత్ర చనిపోతే.. ఆచార్య దాన్ని కంప్లీట్ చేస్తాడని టాక్.

ఆయన బయోపిక్‌గా ఆచార్య మూవీ

ఆయన బయోపిక్‌గా ఆచార్య మూవీ

'ఆచార్య' మూవీ ప్రారంభం అయినప్పటి నుంచి దీనికి సంబంధించి ఇటీవలే ఈ సినిమాను 'సుబ్బారావు పాణిగ్రాహి జీవితం' అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కిస్తున్నారని తెలిసింది. సుబ్బారావు పాణిగ్రాహి అనే పూజారి శ్రీకాకుళం ప్రాంతంలో ఇద్దరు నక్సలైట్లతో కలిసి దేవాదాయ భూముల కోసం పోరాటం చేశాడట. ఇదే కథతో సినిమా రూపొందినట్లు వార్తలు వస్తున్నాయి.

సినిమా విడుదల వాయిదా వేసిస్తూ

సినిమా విడుదల వాయిదా వేసిస్తూ

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'ఆచార్య' మూవీని ఫిబ్రవరి 4వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలో ప్రకటించింది. అయితే, ఇప్పుడు కరోనా కేసులు పెరుగుతుండడంతో పాటు థియేటర్లలో ఆక్యూపెన్సీని తగ్గించడంతో దీన్ని వాయిదా వేశారు. దీనికి సంబంధించి సంక్రాంతి పండుగ రోజునే చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసింది.

కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన టీమ్

కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన టీమ్

క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'ఆచార్య' మూవీ వాయిదా పడడంతో, కొత్త రిలీజ్ డేట్ గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. తాజాగా కొత్త డేట్‌ను ప్రకటించింది. ఈ సినిమాను ఉగాది పండుగ కానుకగా ఏప్రిల్ 1వ తేదీన విడుదల చేస్తున్నారట. ఈ మేరకు ఓ పవర్‌ఫుల్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X