twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    sp balasubrahmanyam.. అది జరగాలంటే మళ్లీ ఎస్పీబీనే పుట్టాలి.. చిరంజీవి, సల్మాన్ ఎమోషనల్

    |

    ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతితో సంగీత ప్రపంచం మూగబోయింది. కోట్ల మంది అభిమానుల్ని ఒంటరి చేసి స్వర్గానికి పయనమయ్యారు. ఆగస్ట్ 5న కరోనా పాజిటివ్ రావడంతో చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. అయితే కరోనా నుంచి కోలుకున్నా కూడా ఆరోగ్యం మాత్రం కుదుటపడేలేదు. నిన్న సాయంత్రం పరిస్థితి విషమించడంతో నేడు (సెప్టెంబర్ 25) ఒంటి గంట నాలుగు నిమిషాలకు ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు. ఎస్పీబీ (74) మరణంతో కుంగిపోయిన చిరంజీవి ఎమోషనల్ అయ్యారు.

    చీకటి రోజు

    చీకటి రోజు

    సంగీత ప్రపంచానికి ఇదో చీకటి రోజు. ఎస్బీ బాలసుబ్రహ్మణ్యం గారి మరణంతో ఓ శకం ముగిసింది. నాకు ఆయన ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు.. నా సక్సెస్‌లో ఆయన పాత్ర ఎంతో ఉంది. ఈ విశ్వంలో ఘంటసాల గారిని మించేవారు ఎవ్వరైనా వస్తారా? అని ఆశ్చర్యపోయారు అని చిరంజీవి పేర్కొన్నాడు.

     లోటు పూడ్చాలంటే మళ్లీ బాలు పుట్టాలి..

    లోటు పూడ్చాలంటే మళ్లీ బాలు పుట్టాలి..

    ఎస్పీబీ గారు ఈ సంగీత ప్రపంచంలో స్టార్‌లా ఓ వెలుగు వెలిగారు. కొన్ని దశాబ్దాలు ప్రాంతాలు, భాషలు అని తేడా లేకుండా హద్దులన్ని చెరిపేసి.. యావత్ భారతావనని మైమరిపించారు. మరో ఎస్పీబీ ఎన్నటికీ ఉండరు.. రారు..ఈ శూన్యాన్ని పూరించాలంటే మళ్లీ ఆయనే పుట్టాలి.. ఆయన మరణించాన్న వార్త తెలియగానే కుంగిపోయాను.. బాలు గారి ఆత్మకు శాంతి చేకూరాలి అని చిరంజీవి ఎమోషనల్ అయ్యాడు.

    శకం ముగిసింది..

    శకం ముగిసింది..

    ఓ శకం ముగిసింది.. సంగీతం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. ప్రపంచం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. నేను ఓ గొప్ప సింగర్ అవ్వడానికి ఆయన తోడ్పాటు అందించదానికి నేను ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు., అది ఏ కాన్సర్ట్ అయినా సరే మీ పాట, మీరు లేకుంటే దాన్ని ఊహించలేం.. ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా అని చిత్ర ట్వీట్ చేశారు.

    Recommended Video

    Rajinikanth,Pawan Kalyan,K viswanath Expresses Their Condolences For SPB
    గుండె బద్దలైంది..

    గుండె బద్దలైంది..

    ఎస్పీబీ గారి గురించి విన్న తరువాత నా హృదయం బద్దలైంది. ఈ సంగీతం ప్రపంచంలో మీరెప్పుడూ చిరస్థాయిగా నిలిచిపోతారు సర్.. మీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి అని సల్మాన్ ఖాన్ ట్వీట్ చేశాడు, నిన్నటి బాలు పరిస్థితిపైనా సల్మాన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు.

    English summary
    Legendary singer SP Balasubrahmanyam (SPB) dies at the age of 74 who got infected due to coronavirus on August 5, 2020. Apart from this On August 5th SP Charan shared a video about sp balasubrahmanyam health condition. He died in Chennai's MGM Hospital.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X