Don't Miss!
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్‌పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
sp balasubrahmanyam.. అది జరగాలంటే మళ్లీ ఎస్పీబీనే పుట్టాలి.. చిరంజీవి, సల్మాన్ ఎమోషనల్
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతితో సంగీత ప్రపంచం మూగబోయింది. కోట్ల మంది అభిమానుల్ని ఒంటరి చేసి స్వర్గానికి పయనమయ్యారు. ఆగస్ట్ 5న కరోనా పాజిటివ్ రావడంతో చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. అయితే కరోనా నుంచి కోలుకున్నా కూడా ఆరోగ్యం మాత్రం కుదుటపడేలేదు. నిన్న సాయంత్రం పరిస్థితి విషమించడంతో నేడు (సెప్టెంబర్ 25) ఒంటి గంట నాలుగు నిమిషాలకు ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు. ఎస్పీబీ (74) మరణంతో కుంగిపోయిన చిరంజీవి ఎమోషనల్ అయ్యారు.
చీకటి రోజు
సంగీత ప్రపంచానికి ఇదో చీకటి రోజు. ఎస్బీ బాలసుబ్రహ్మణ్యం గారి మరణంతో ఓ శకం ముగిసింది. నాకు ఆయన ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు.. నా సక్సెస్‌లో ఆయన పాత్ర ఎంతో ఉంది. ఈ విశ్వంలో ఘంటసాల గారిని మించేవారు ఎవ్వరైనా వస్తారా? అని ఆశ్చర్యపోయారు అని చిరంజీవి పేర్కొన్నాడు.
లోటు పూడ్చాలంటే మళ్లీ బాలు పుట్టాలి..
ఎస్పీబీ గారు ఈ సంగీత ప్రపంచంలో స్టార్లా ఓ వెలుగు వెలిగారు. కొన్ని దశాబ్దాలు ప్రాంతాలు, భాషలు అని తేడా లేకుండా హద్దులన్ని చెరిపేసి.. యావత్ భారతావనని మైమరిపించారు. మరో ఎస్పీబీ ఎన్నటికీ ఉండరు.. రారు..ఈ శూన్యాన్ని పూరించాలంటే మళ్లీ ఆయనే పుట్టాలి.. ఆయన మరణించాన్న వార్త తెలియగానే కుంగిపోయాను.. బాలు గారి ఆత్మకు శాంతి చేకూరాలి అని చిరంజీవి ఎమోషనల్ అయ్యాడు.
శకం ముగిసింది..
ఓ శకం ముగిసింది.. సంగీతం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. ప్రపంచం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. నేను ఓ గొప్ప సింగర్ అవ్వడానికి ఆయన తోడ్పాటు అందించదానికి నేను ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు., అది ఏ కాన్సర్ట్ అయినా సరే మీ పాట, మీరు లేకుంటే దాన్ని ఊహించలేం.. ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా అని చిత్ర ట్వీట్ చేశారు.
Recommended Video
గుండె బద్దలైంది..
ఎస్పీబీ గారి గురించి విన్న తరువాత నా హృదయం బద్దలైంది. ఈ సంగీతం ప్రపంచంలో మీరెప్పుడూ చిరస్థాయిగా నిలిచిపోతారు సర్.. మీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి అని సల్మాన్ ఖాన్ ట్వీట్ చేశాడు, నిన్నటి బాలు పరిస్థితిపైనా సల్మాన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు.