ముంబై వీధుల్లో చిరుతో తమన్నా.. ఎందుకెళ్లారో తెలుసా..? సూపర్బ్ స్కెచ్!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మిల్కీ బ్యూటీ tamanna నగరంలో షికారు చేస్తున్నారు. అక్కడి మీడియాతో పెద్ద ఎత్తున ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. చిరంజీవితో కలిసి ఫోటోలకు ఫోజులిస్తూ తమన్నా తెగ సంబర పడుతోంది. తాజాగా ఇందుకు సంబంధించిన కొన్ని పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తెలుగు సెలెబ్రిటీల హవా చూసి బీ టౌన్ ప్రేక్షకులు సైతం ఫిదా అవుతున్నారు.

మెగా సినిమాలో భాగమైన తమన్నా
మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా నరసింహా రెడ్డి' లో భాగమైంది తమన్నా. గతంలో బాహుబలి సిరీస్ ద్వారా చారిత్రాత్మక చిత్రాల్లో తనకంటూ ఓ ప్రత్యేకత ఉండేలా నటిస్తానని నిరూపించిన తమన్నా.. ఇప్పుడు 'సైరా నరసింహా రెడ్డి' సినిమాలో నర్తకిగా అలరించేందుకు సిద్ధమైంది. సైరా ట్రైలర్ చూస్తే ఈ సినిమాలో తమన్నా క్యారెక్టర్ ఏ రేంజ్‌లో ఉండనుందో అర్థమవుతోంది.

ముంబై వీధుల్లో చిరుతో తమన్నా
'సైరా నరసింహా రెడ్డి' సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో అన్ని భాషల్లోనూ పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేపడుతున్నారు యూనిట్ సభ్యులు. ఇందులో భాగంగానే ముంబై నగరానికి వెళ్లి అక్కడి ఆడియన్స్‌ని టచ్ చేస్తున్నారు చిరంజీవి, తమన్నా. ఈ ఇద్దరికీ బాలీవుడ్ జనం ఘన స్వాగతం పలికారని తెలిసింది.

ప్యాన్ ఇండియా మూవీ.. ప్రేక్షకుల్లో ఆతృత
సైరా నరసింహా రెడ్డి సినిమాను ప్యాన్ ఇండియా మూవీగా అత్యంత గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. తెలుగు సహా పలు భాషల్లోని బడా స్టార్స్ ఈ సినిమాలో భాగం కావడంతో దేశ వ్యాప్తంగా 'సైరా' పై క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఆడియన్స్ అంతా సైరా విడుదల తేదీ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

హిందీలో భారీ డిమాండ్.. అత్యధిక థియేటర్స్
హిందీలో సైరా డిమాండ్ చూసి అక్కడి డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఎక్సెల్ వారు థియేటర్స్‌ని మెల్లిమెల్లిగా పెంచుతూ పోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కన్ఫర్మ్ అయిన థియేటర్స్ సంఖ్య 1400. డిమాండ్ దృష్ట్యా మరో రెండు రోజుల్లో ఈ కౌంట్ 1800 నుండి 2000 వరకు వెళ్ళే అవకాశం ఉందని తెలుస్తోంది.

టీజర్, ట్రైలర్ సెన్సేషన్.. సెన్సార్
సైరా నరసింహా రెడ్డి సినిమా టీజర్, ట్రైలర్ ఇప్పటికే నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో వ్యూస్ పరంగా సరికొత్త రికార్డులకు తెరలేపుతూ సినిమాపై ఉన్న అంచనాలకు రెక్కలు కట్టాయి. ఇక సైరా చూసిన సెన్సార్ సభ్యులు సింగిల్ కట్ కూడా లేకుండా యూ/ఏ సర్టిఫికెట్ అందించారు.

సైరా నరసింహా రెడ్డి విశేషాలు చూస్తే..
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మాణంలో 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి లీడ్ రోల్ పోషించగా.. అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











