తమ్ముడిపై కట్టలు తెంచుకొనేంత కోపంతో క్లాస్ పీకిన చిరంజీవి...
'ఆరంజ్" ప్లాప్ తో దర్శకులందరూ వైరస్ లాంటి వారని ఆడియో ఫంక్షన్స్ లోనూ, మీడియాలోనూ ఊదరకొట్టిన మెగాస్టార్ తమ్ముడు నాగబాబు, మౌనంగా కూర్చోక మరొక మెగా ప్రయత్నానికి శ్రీకారం చుట్టాలని ప్రయత్నిస్తున్నాడు. ఎవరితోనూ సినిమా తీసే ప్రయత్నం కాదు, సాక్షాత్తూ మెగాస్టార్ చిరంజీవిని పెట్టి, తియ్యాలని కోరిక పుట్టింది. సొంత అన్నయ్యతో సినిమాతీసి హిట్ చేద్దామనే కోరికతో ఉండటం వలన, చిరును కలసి తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
నాగబాబు కోరికను విన్న మెగాస్టార్ చిరుకు ఎక్కడలేని కోపమొచ్చింది. 'ఆరెంజ్"ను తీసి 'మగధీర" రికార్డును చేస్తాడనే నమ్మకంతో రామ్ చరణ్ తేజ్"ను అప్పగిస్తే అట్టర్ ప్లాప్ సినిమా తీశావని, నెం వన్ పొజీషన్ కు వెళ్లిన రామ్ చరణ్ తేజ్ ను ఒక్కసారిగా పడేసిన ఘనత నీకే దక్కింది,. పైగా నాతో చిత్రం చేద్దామని నీకెలా అనిపించింది? అని చివాట్లు పెట్టినట్లు తెలుస్తోంది.
నాగబాబు అన్నయ్య మాటలకు పెద్దగా బాధపడక, 150వ చిత్రంగ నీతో మెగా హిట్ట్ కొడతానని, వివి వినాయక్ ను దర్శకుడిగా పెట్టుకుని, 2011లో హిట్ట్ ను అందిస్తానని చెప్పాడట. చిరుకు చిర్రెత్తి, నీవు మెగా సినిమా తీయ్యద్దు, ఏమివద్దు ముందు పార్టీ పనులు చూడమని మెత్తగా బుద్ది చెప్పినట్టు వార్తలు వచ్చాయి. పాపం 'ఆరెంజ్ ప్లాప్"తో నమ్మకాన్ని పొగొట్టుకున్న నాగబాబు మౌనంగా 'చిరు" మాటలను ఓకే అని సినిమా తీసే ఆలోచనను ప్రక్కన పెట్టినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











