Mega Princess Name: మెగా మనవరాలికి అమ్మవారి పేరు.. అధికారికంగా ప్రకటించిన చిరు.. ఏంటో తెలుసా?
రామ్ చరణ్, ఉపాసన తల్లిదండ్రులు కావడం, మెగా కుటుంబంలోకి ప్రిన్సెస్ రావడంతో చిరంజీవి కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది. ఇక మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబంలోకి మహాలక్ష్మి అడుగు పెట్టిందంటూ మురిసిపోయారు. అభిమానులు సైతం సంబరాలు చేసుకుంటున్నారు. అయితే శుక్రవారం మెగా ఇంట ప్రిన్సెస్ నామకరణ దినోత్సవ వేడుక జరుగుతుంది. ఇదిలా ఉండగా చిరంజీవి తన మనవరాలు పేరును ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. ఆ వివరాల్లోకి వెళితే....
11 ఏళ్ల తర్వాత...:రామ్ చరణ్ ఉపాసన 2012లో వివాహం చేసుకున్నారు. అయితే దాదాపు 11 ఏళ్ల తర్వాత వీరిద్దరూ తల్లిదండ్రులు అయ్యారు. దీనితో మెగా ఇంట సంబరాల్లో మునిగిపోయింది. ఇక జూన్ 20న ఈ దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మనిచ్చింది. ఇక ఆడబిడ్డ పుట్టడంపై మహాలక్ష్మి పుట్టిందంటూ కుటుంబంతో సహా చిరంజీవి మురిసిపోయారు. ఇక ఉపాసన డిశ్చార్జ్ సమయంలో కూడా రామ్ చరణ్ మీడియాతో మాట్లాడుతూ హార్షం వ్యక్తం చేశాడు.

ఘనంగా బారసాల:ఆ సమయంలో బిడ్డకు ఏం పేరు పెట్టబోతున్నారు అని ఓ రిపోర్టర్ అడగ్గా... సాంప్రదాయం ప్రకారం బారసాల రోజు వెల్లడిస్తామంటూ సమాధానమిచ్చాడు. అయితే ఓ పేరు అనుకుంటున్నట్లు.. అదే పేరును ఫిక్స్ అయినట్లు తెలిపాడు. ఇక బిడ్డ ఎవరి పోలిక అని అడగ్గా... ఇంకెవరి పోలిక నాన్న పోలికే ఉంటుంది... అంటూ సమాధానం ఇచ్చాడు. ఇక ఈరోజు మెగా ప్రిన్సెస్ కోసం జరగనున్న బారసాల వేడుక కోసం భారీ ఏర్పాట్లు చేశారు.

వేడుకకు ప్రముఖులు:చిరంజీవి నివాసంలో లక్షల రూపాయలు ఖర్చు చేసి అలంకరణ చేశారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఇప్పటికే దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఉదయం నుంచి చిరంజీవి మనవరాలి పేరు ఇదే అంటూ ఉదయం నుంచి వార్తలు వచ్చాయి. ఇక ఆ వార్తలకు చిరంజీవి చెక్ పెట్టాడు. ఆ పేరోంటో ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు.
మెగా ప్రిన్సెస్ పేరు ఇదే:తన మనుమరాలు పేరును చిరంజీవి ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. ఆ బేబీ పేరును క్లీన్ కారా కొణిదలగా (#KKK) ప్రకటించాడు. లలిత సహస్రనామం నుంచి తీసుకోబడిందని చెప్పుకొచ్చాడు. ఈ పేరు.. ఆధ్యాత్మిక మేల్కొలుపును తీసుకువచ్చే శక్తిని, ప్రకృతి స్వరూపాన్ని సూచిస్తుంది. ఈ లక్షణాలను మా లిటిల్ ప్రిన్సెస్ అందిపుచ్చుకొని తన వ్యక్తిత్వంలో పెరిగే కొద్దీ ఇమడ్చుకుంటుందని కచ్చితంగా నమ్ముతున్నాము.. అంటూ చిరంజీవి ట్విట్టర్లో రాసుకొచ్చారు.
సోషల్ మీడియాలో ట్రెండింగ్.:ఇక ఇప్పుడు చరణ్ కూతురి పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. అందరూ ఆ పసిబిడ్డను ఆశ్వీర్వదిస్తున్నారు. ఇంకా.. చిరంజీవి, సురేఖతో పాటు ఉపాసన తల్లితండ్రులు ఉన్న ఫోటోను కూడా చిరంజీవి షేర్ చేశారు. ఈ ఫోటో కూడా వైరల్ గా మారింది. మరోవైపు ఫ్యాన్స్ సంబర పడిపోతున్నారు. మెగా ప్రిన్సెస్ ఎంట్రీతో చరణ్.. గొప్ప స్థాయికి ఎదుగుతారని అంతా అనుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











