హాట్ టాపిక్: చిరు ఆ సీక్వెల్ చేస్తారా?
సంజయ్ దత్ చేసిన మున్నాభాయ్ సిరీస్ లోని రెండు సినిమాలను తెలుగులో శంకర్ దాదా సీరిస్ గా చిరంజీవి రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సంజయ్ దత్ మరో సీక్వెల్ తో ముందుకు వస్తున్నాడు. మున్నాభాయ్ కీ ఆత్మ కథ అనే టైటిల్ తో ఆ చిత్రం 2012 లో తెరకెక్కనుంది. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు రాజ్ హిర్వాణి,నిర్మాత విధు వినోద్ చోప్రా మీడియాకు తెలియచేసారు. ఈ నేఫధ్యంలో చిరంజీవి ఈ సీక్వెల్ ని కూడా చేస్తారా లేక మరో నటుడు వచ్చి ఆ సీక్వెల్ ని చేస్తాడా అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక సంజయ్ దత్ తో మున్నా భాయ్ ఛలో అమెరెకా చిత్రాన్ని గంతలో ప్రకటించినా అది మెటీరియలైజ్ కాలేదు. ఇప్పుడు ఈ ఆత్మకథ మాత్రం 2012 లో షూటింగ్ మొదలై అదే సంవత్సరంలో విడుదల అవుతుందని ప్రకటించారు. ఇప్పటికే ఈ చిత్రంపై కమల్ హాసన్ ఆసక్తి చూపిస్తూ దర్శక,నిర్మాతలకు విషెష్ తెలియచేసినట్లు తెలుస్తోంది. ఇక మున్నాభాయ్ సీరిస్ ని ప్రతీ భాషలోనూ రీమేక్ చేసారు.
అన్ని భాషలోనూ ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. అలాగే కొద్ది రోజుల క్రితం మున్నాభాయ్ సీరిస్ ని హాలీవుడ్ నిర్మాతలు రైట్స్ సైతం అడిగారు. అయితే విధు వినోద్ చోప్రా నిరాకరించారు. ఇక ఈ చిత్రంలో కూడా మున్నాభాయ్‌గా సంజయ్‌దత్, అతని అసెస్టెంట్ సర్క్యూట్ పాత్రలో అర్షద్ వార్శిలు నటించనున్నారు. నిర్మాత విదు వినోద్ చోప్రా ఈ విషయమై మాట్లాడుతూ 'సంజయ్, అర్షద్ వార్శిలు ప్రధాన పాత్రల్లో 'మున్నాభాయ్ ఆత్మ్‌కథ' చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాం. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో సినిమాని ప్రారంభిస్తాం. మున్నాభాయ్ సిరీస్ లో వచ్చిన గత చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా వుంటుంది' అన్నారు.


Click it and Unblock the Notifications












