Chiranjeevi: బేబి కోసం మెగా ఈవెంట్.. ప్లాన్ చేసిన చిరంజీవి! ఎప్పుడు? ఎక్కడంటే?
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వినిపిస్తున్న సినిమా పేరు బేబి (Baby Movie 2023). ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకులతోపాటు సినీ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాకుండా ఇటీవల ఓ స్పెషల్ ఈవెంట్ కండక్ట్ చేసి ప్రత్యేకంగా అభినందనలు తెలిపాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ ఈవెంట్ లో అల్లు అర్జున్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే మొన్న బన్నీ వంతు కాగా.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి వంతు వచ్చింది. కలెక్షన్లతో దూసుకుపోతున్న బేబి సినిమా కోసం మెగా ఈవెంట్ నిర్వహించనున్నారని డైరెక్టర్ సాయి రాజేష్ హింట్ ఇచ్చేశాడు.
స్వయంకృషితో ఎదిగిన చిరంజీవి మెగాస్టార్ గా మారారు. గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఆయన త్వరలో భోళా శంకర్ మూవీతో ప్రేక్షకులను, అభిమానులను అలరించనున్నారు. అలాగే మలయాళ సూపర్ హిట్ మూవీ బ్రో డాడీ రీమెక్ కూడా లైన్ లో పెట్టారు. అయితే చిరంజీవికి ఏదైనా సినిమా నచ్చినా, సకెస్స్ అయినా ప్రశంసించకుండా ఉండరు. అలా గతంలో ఎన్నో సినిమాలు ప్రశంసించిన ఆయన డైరెక్టర్, హీరోలకు శాలువా కప్పి మరి అభినందించారు.

ఇప్పుడు ఏపీ తెలంగాణలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న బేబి సినిమాను మెగాస్టార్ చిరంజీవి ప్రశంసించినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి తాజాగా బేబి డైరెక్టర్ సాయి రాజేష్ సోషల్ మీడియా వేదికగా ఆనందాన్ని పంచుకున్నారు. చిరంజీవిని కలిసిన బేబి టీమ్ ఫొటోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. "నా కల నెరవేరింది. నా దేవుడితో రెండు గంటల సమయాన్ని గడిపాను. బేబి సినిమా ఆయనకు నచ్చింది. ప్రతీ ఒక్కరినీ, ప్రతి ఒక్క క్రాఫ్ట్ ని మెచ్చుకున్నారు" అని సాయి రాజేష్ ట్వీట్ చేశారు.
డైరెక్టర్ సాయి రాజేష్ ఇంకా కొనసాగిస్తూ.. "చిరంజీవి గారితో మాట్లాడిన ఈ క్షణాలను జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. రెండు గంటలు బాబాయ్.. రెండు గంటలు.. అట్లా బాస్ మాట్లాడుతుంటే కన్నీళ్లు తిరిగాయి. బేబి సినిమా కోసం ఓ మెగా ఈవెంట్ లోడ్ అవుతోంది" అని అసలు మ్యాటర్ చెప్పారు. ఇలా బేబి కోసం చిరంజీవి స్పెషల్ మెగా ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్లుగా డైరెక్టర్ సాయి రాజేష్ హింట్ ఇచ్చేశారు. ఈ మెగా ఈవెంట్ ఎప్పుడు?, ఎక్కడ? అనే విషయాలు ఇంకా తెలియరాలేదు. కానీ ఆ కార్యక్రమంలో చిరంజీవి ఏం మాట్లడతారు?, ఎలాంటి విషయాలు పంచుకుంటారు? అనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.


Click it and Unblock the Notifications











