twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజకీయాల్లో ఓటమి చెందలేదు.. దిగజారలేదు.. డల్లాస్‌లో చిరంజీవి ఉద్వేగ ప్రసంగం

    By Rajababu
    |

    అమెరికాలో నిర్వహించిన తానా సమావేశాల్లో పాల్గొనేందుకు మెగాస్టార్ చిరంజీవి డల్లాస్ వెళ్లారు. తానా సభలో పాల్గొన్న తర్వాత ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమెరికాలో తన అభిమానులు ఏర్పాటు చేసిన కానా అసోసియేషన్‌ నిర్వహించిన ప్రైవేట్ కార్యక్రమంలో చిరంజీవి పాల్గోన్నారు. రాజకీయాల్లోకి వచ్చి తాను ఓటమిపాలు కాలేదు. దిగజారలేదని చిరంజీవి ఉద్వేగం ప్రసంగించారు. ఓ దశలో కంటతడి పెట్టుకొనే విధంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పితాని సత్యనారాయణ, ఏపీ భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధ ప్రసాద్, మంత్రి గంటా శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

     మనసు విప్పి మాట్లాడాలని

    మనసు విప్పి మాట్లాడాలని

    అభిమానులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ.. అమెరికాలో ఇలాంటి సమావేశంలో మాట్లాడుతానని అనుకోలేదు. అభిమానులు ఏర్పాటు చేసిన ఇంతటి ఆత్మీయ సమావేశంలో మనసు విప్పి మాట్లాడాలని అనుకొన్నాను. ఇలాంటి వేదికపై మాట్లాడటానికి చాలా ఎమోషనల్‌గా ఫీలవుతున్నాను.

     వివరంగా మాట్లాడాలని

    వివరంగా మాట్లాడాలని

    కానా సమావేశానికి చాలా మంది పిల్లలు వచ్చారు. మధ్యాహ్నం మూడు గంటలు కావోస్తున్నందున వారు ఆకలితో బాధపడుతారనే ఉద్దేశంతో త్వరగా ముగించాలని అనుకొన్నాను. కానీ మీ అప్యాయత, అనురాగాలు చూసిన తర్వాత చాలా వివరంగా మాట్లాడేందుకు సిద్ధమయ్యాను.

    Recommended Video

    Tollywood Top Heros Attend To Chiranjeevi sudden Meet
    కానా ఉందని ఇక్కడే తెలిసింది

    కానా ఉందని ఇక్కడే తెలిసింది

    తానా ఆహ్వానం మేరకు నేను అమెరికాకు వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత కానా అనే సంస్థను ఏర్పాటు చేశారని తెలుసుకొన్నాను. నాకు తెలిసే ఉంటుందని మీరు అనుకొని ఉంటారు. మిమ్మల్ని చూస్తుంటే నిశ్శద్ద సైనికులు అని అనుకొంటున్నాను. ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా సోదరి, సోదరిమణులు గుర్తింపు కోసం కాదు.. సంతృప్తి కోసం పనిచేయడం నాకు స్ఫూర్తిని కలిగిస్తున్నది.

    మీరు నాకు స్పూర్తి ప్రధాతలు

    మీరు నాకు స్పూర్తి ప్రధాతలు

    కానా అసోసియేషన్ ఏర్పాటుతో అనేక కార్యక్రమాలు చేపడం నాకు స్ఫూర్తిని కలిగిస్తున్నది. ఎంతో మందికి స్పూర్తిని కలిగిస్తూ మీరు చేస్తున్న కృషికి ధన్యవాదాలు. మీరు నాకు స్ఫూర్తి ప్రధాతలు.

    జీవితంలో చాలా కోల్పోయేవాడిని

    జీవితంలో చాలా కోల్పోయేవాడిని

    ఈ కార్యక్రమం కోసం వారం రోజులుగా కష్టపడుతూ ఇంత గ్రాండ్‌గా చేసిన ప్రతీ ఒక్కరికి థ్యాంక్స్. మీ పేర్లు మాకు తెలియవు. కానీ మీ పేర్లు తెలుసుకొంటాను. ఒకవేళ ఈ కార్యక్రమంలో పాల్గొనకపోయి ఉంటే జీవితంలో చాలా కోల్పోయేవాడిని అని చిరంజీవి అన్నారు.

     అందుకే రాజకీయాల్లోకి

    అందుకే రాజకీయాల్లోకి

    అభిమానుల కోరిక మేరకు, సమాజంలోని అసమానతలను రూపుమాపడానికి, సామాజిక న్యాయం కోసం రాజకీయాల్లోకి వచ్చాను. ప్రజలకు ఉన్నతమైన ప్రమాణాలతో కూడిన జీవితాన్ని అందించాలనే కోరిక ఉండేది.

     18 మంది ఎమ్మెల్యేలతో

    18 మంది ఎమ్మెల్యేలతో

    రాజకీయాల్లోకి వచ్చి కేవలం 18 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకొని ఓటమి పాలయ్యానని అనుకొంటారు. ఆ పరిస్థితుల్లో అసంతృప్తికి గురికాలేదు. ప్రజలు ఇచ్చిన తీర్పు అని భావించాను. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి వెనుక కారణాలను మీకు చెప్పాల్సిన అవసరం ఉంది అని అన్నారు.

    జాతీయ పార్టీతో సాధ్యమని

    జాతీయ పార్టీతో సాధ్యమని

    ఏదైతే సామాజిక బాధ్యత గురించి నేను రాజకీయాల్లోకి వచ్చానో.. అది జాతీయపార్టీతోనే సాధ్యమవుతుందని అనుకొన్నాను. అందుకే ఆ పార్టీతో కలిసి జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో పనిచేశాను. నా స్థాయిలో నేను ప్రజలకు సేవ చేసే అవకాశం లభించింది.

    దిగజారలేదు.. పక్కదారి పట్టలేదు

    దిగజారలేదు.. పక్కదారి పట్టలేదు

    కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేసిన తర్వాత రాష్ట్రాభివృద్ధికి కేంద్రమంత్రిగా నా వంతు ప్రయత్నం చేశాను. రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా, కేంద్రమంత్రిగా ప్రజాసేవలో విజయం సాధించాను. రాజకీయంగా ముందుకెళ్లాను తప్ప దిగజారలేదు.. పక్కదారి పట్టలేదు అని ఉద్వేగంగా చిరంజీవి ప్రసంగించారు.

    English summary
    Mega star Chiranjeevi visited US recently. He attended for TANA convention. After that, He participated Fans orgnanised meeting for KANA association. In this occassion, Chiranjeevi shared about his political life and Praja Rajyam party.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X