చాపకింద నీరులా చిరంజీవి ప్రభావం రాష్ట్ర రాజకీయాలను భయపెడుతున్నాయి. చిరంజీవికి అనుకోని రీతిలో మద్ధతు కూడా లభిస్తోంది. ఇంతదాకా అభిమానుల నుంచే అనుకుంటే చేగొండి హరిరామ జోగయ్య ప్రకటనలు చిరంజీవికి ఉచిత ప్రచారాన్ని కల్పించాయి. రాజకీయాలలో ప్రవేశించడానికి ముందే చిరంజీవి కూడా తనదైన స్టైల్లో జనాల పల్స్ తెలుసుకునే పనిలో పడ్డారు. ఆ క్రమంలోనే ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో యువజన సంఘాల తెలంగాణా స్థాయి సదస్సు నిర్వహించడానికి మెగాస్టార్ చిరంజీవి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నెలాఖర్లోగా తేదీ ప్రకటిస్తారని తెలుస్తోంది. నైజాం ప్రాంతానికి చెందిన అంజనీ పుత్ర కార్యకర్తలు కూడా ఇందులో పాలుపంచుకోనున్నట్టు సమాచారం. ఈ సదస్సుకు సీనియర్ ప్రొఫెర్లను రప్పించే ప్రయత్నం జరుగుతోంది. తెలంగాణాపై వైఖరిని కూడా ఈ సందర్భంగా చిరంజీవి తన అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.