మెగాస్టార్ చిరంజీవి సాక్షిగా ‘రంగం’ శతదినోత్సవం..!

By Sindhu

ప్రముఖ నిర్మాత ఆర్‌బీ చౌదరి తనయుడు జీవా కథానాయకుడిగా తమిళంలో రూపొందిన 'కో" చిత్రం తెలుగులో 'రంగం" పేరుతో విడుదలైన సంగతి తెలిసిందే. కార్తీక కథానాయికగా నటించిన ఈ చిత్రానికి కెవీ ఆనంద్ దర్శకుడు. తెలుగులో ఇటీవలి కాలంలో యూత్ ని బాగా ఆకట్టుకున్న చిత్రమిది. ఈ చిత్రం శతదినోత్సవ వేడుక ఈ నెల 28న తిరుపతిలో జరగనుంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నాడు.

ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు ఆర్‌బీ చౌదరి మాట్లాడుతూ 'రంగం" చిత్రం తెలుగులో ఘనవిజయం సాధించడం ఆనందంగా వుంది. ఈ చిత్రంతో జీవా తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. ఈ చిత్రం విడుదలైన అన్నీ కేంద్రాల్లో విజయవంతంగా ప్రదర్శింపబడింది. 30కి పైగా కేంద్రాల్లో వందరోజులు ప్రదర్శింపబడటం ఆనందంగా వుంది. అందుకే ఈ సంతోషాన్ని అందరితో పంచుకోవాలని ఈ నెల 28న తిరుపతిలోని బిగ్ సినిమా థియేటర్‌ లో శతదినోత్సవ వేడుకలు జరపనున్నాం. ఈ వేడుకకు చిరంజీవి ముఖ్య అతిథిగా రావడం సంతోషంగా వుంది" అని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X