»   » చిరంజీవి-బాలయ్య సరదాగా...(కిస్ అండ్ మేక్ అప్ ఫోటో )

చిరంజీవి-బాలయ్య సరదాగా...(కిస్ అండ్ మేక్ అప్ ఫోటో )

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చిరంజీవి, బాలయ్య మధ్య అటు సినిమాల పరంగా....ఇటు రాజకీయాల పరంగా ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో కొత్తగా చెప్పక్కర్లేదు. అలాంటి ఈ ఇద్దరి మధ్య కిస్ అండ్ మేక్‌అప్(ప్రత్యర్థులుగా ఉన్న వారు ఆత్మీయంగా కలవడం) సన్నివేశం సర్వత్రా చర్చనీయాంశం అయింది.

ఈ ఇద్దరూ తాజాగా మంచు మనోజ్ పెళ్లి కొడుకు సెర్మనీ సందర్భంగా హాజరై ఒకరినొకరు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. సరదాగా మాట్లాడుకున్నారు. సినిమాలు, రాజకీయాల పరంగా ఎంత పోటీ ఉన్నా....వ్యక్తిగతంగా తాము మంచి స్నేహితులమనే విషయాన్ని చాటి చెప్పారు.

బాలయ్య, చిరంజీవి సినిమా రంగంలో మంచి ఫాంలో ఉన్న రోజుల్లో ఇద్దరూ కూడా బాక్సాఫీసుపై ఆధిపత్యం సాధించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తుండే వారు. ఇటు మెగాస్టార్ చిరంజీవికి...అటు యువరత్న బాలకృష్ణ‌కి భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలో వీరి సినిమాల సందర్భంగా అభిమానులు చేసే హడావుడి ఓ రేంజిలో ఉండేది.

Chiranjeevi-Balakrishna @ Manchu Manoj Pellikoduku Ceremony

ఇద్దరి మధ్య పలు సందర్భాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు కూడా చోటు చేసుకున్నాయి. ఓ సారి రాజకీయ సభలో బాలయ్య మాట్లాడుతూ....కేవలం ముఖ్యమంత్రి కావాలనే కోరికతోనే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించారని, ప్రజలకు సేవ చేయడానికి కాదని వ్యాఖ్యానించారు. పార్టీని నడపటం చేతగాకనే ఆయన తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసారని ఆరోపించారు. బాలయ్య ఆరోపణలతో అసహనానికి గురైన చిరంజీవి మాట్లాడుతూ...‘బాలయ్య నా స్నేహితుడు. కానీ అతనివి పిల్ల చేష్టలు. అలాంటపుడు ఆయన చేసే వ్యాఖ్యలు తాను పట్టించుకోవాల్సిన అవసరం లేదు' అని వ్యాఖ్యానించారు. తనవి పిల్ల చేష్టలన్న చిరంజీవిపై బాలయ్య మళ్లీ కౌంటర్ కామెంట్ చేసారు. నావి పిల్ల చేష్టాలా...? ఓకే. నేను చేసిన ఆరోపణల్లో నిజం లేక పోతే ఆయన కేంద్ర మంత్రి పదవి కోసం లాబీయింగ్ ఎందుకు చేసారు? అని ప్రశించారు.

వృత్తి పరంగా చిరంజీవి, బాలకృష్ణ మధ్య ఎంత పోటాపోటీ వాతావరణం ఉన్నప్పటికీ....వారు వ్యక్తిగతంగా మాత్రం మంచి స్నేహితులుగా మెలిగేవారు. వ్యక్తి గత జీవితాన్ని వృత్తి జీవితంతో ముడి పెట్టి చూసే వారు కాదు. తమ ప్రొఫెషనల్, వ్యక్తిగత జీవితాలను వారు ఇప్పటికీ అలానే మెయంటేన్ చేస్తున్నారు.

English summary
Here is the best picture from Manchu Manoj's Pellikoduku Ceremony held Yesterday. Chiranjeevi and Balakrishna were spotted enjoying themselves during their stay at the function.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu